వనపర్తి, జనవరి 27 : మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్ర జాప్రతినిధులు, కార్యకర్తలతో శనివారం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలు, రానున్న పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచనలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రవేశపెట్టిందని, వీటిపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా యకులు, కార్యకర్తలతో కలిసి ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆరే మళ్లీ సీఎం కా వాలన్న ఆకాంక్ష మొదలైందన్నారు. నియోజకవర్గంలో ని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనతోపాటు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు.
సుదీర్ఘ పోరాటం తరువాత సాధించిన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేశా క కేవలం కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేయడంతోనే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని పచ్చని మాగాణిగా మార్చగలిగామన్నారు. ఎవరూ ఊ హించని విధంగా పట్టణ రూపురేఖలు మార్చామన్నా రు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేస్తే విజయం సాధిస్తామనుకున్నామని, కానీ చేసిన పనిని ప్రజలకు వివరించడంలో వెనుకబడ్డామన్నారు. ప్రతి పల్లె, పట్టణా న్ని 90 శాతం డెవలప్మెంట్ చేశామని, మరిన్ని పనులకు కూడా కేసీఆర్ సర్కారు హయాంలో నిధులు మం జూరు చేశామన్నారు.
వాటిని పూర్తి చేసేందుకు కృషి చే ద్దామని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు నడుం బిగించాలన్నారు. మాజీ ఎంపీ రావుల మాట్లాడుతూ వనపర్తి అభివృద్ధి కోసం నిరంజన్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందన్నారు. నిరంజన్‌రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నా రు. పదవీకాలం ముగుస్తుండడంతో నియోజకవర్గంలోని సర్పంచులను మాజీ మంత్రి, మాజీ ఎంపీ సన్మానించారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ గ్రా మ పంచాయతీల అభివృద్ధి కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎ స్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాగం తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రమోద్‌రెడ్డి, నాయకులు లక్ష్మయ్య, రాములు, వెంకటేశ్, బుచ్చిరెడ్డి, కురుమూర్తియాదవ్, మీడియా క న్వీనర్ అశోక్, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.