అక్టోబర్ 30 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే తెలంగాణలోనూ వస్తుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మూస్తంభంతండా, నేలబండతండా, వాయిల్గడ్డతండా, ఎక్వాయిప ల్లి, పెద్ద ఆదిరాల, రామస్వామిగుట్ట తం డా, చిన్నఆదిరాల, తుపుడగడ్డతండా, కొ ల్లోనిమోర్ల, చంద్రుతండాల్లో ఎన్నికల ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకు నే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అంతకుముందు ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
మేముసైతం లక్ష్మన్న కోసం..జడ్చర్ల, అక్టోబర్ 30 : జడ్చర్ల మండలంలోని పెద్దఆదిరాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు చిన్న వాహనానికి బీఆర్ఎస్ జెండాను కట్టించుకొని తిరిగారు. వీరి వాహనం ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.