గద్వాల, జూలై 6 : నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞత తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించగా.. ఎమ్మెల్యే అబ్రహం ర్యాలీలో భాగస్వాములయ్యారు. పాతబస్టాండ్ నుంచి కృష్ణవేణి, అంబేద్కర్ చౌక్ మీ దుగా తిరిగి పాతబస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. వి ద్యార్థులు బతుకమ్మ పాటలకు స్టెప్పులేశారు. పట్టణంలోని రోడ్లన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. పాతబస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు ఎమ్మెల్యేలు విద్యార్థులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో పాలకులు ఎన్నికల సమయంలో మెడికల్ కళాశాల తీసుకొస్తామని మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని, ఆ తరువాత హామీ గురించి ఊసే ఎత్తలేదన్నారు. గద్వా ల ప్రాంతంపై నిర్లక్ష్యం వహించడంతో ప్రాంతం విద్య, వైద్యపరంగా ఎంతో వెనుకబడిపోయామన్నారు. ఆసి యా ఖండంలోనే అక్షరాస్యతలో గట్టు మండలం వెనుకబడి ఉండేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. అన్ని జిల్లాలను సమాన దృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కోసం గు రుకులాలు ఏర్పాటు చేశారన్నారు. నర్సింగ్, పీజీ కళాశాల, ఎంబీఏ వంటి కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో ఈ ప్రాంతం అక్షరాస్యత శాతంలోముందుకువెళ్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి 100 సీట్లకు అనుమతి ఇచ్చారని.. కళాశాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకుందామన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మూడు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని.. తాను ఉస్మానియా మెడికల్ కళాశాలలో చదువుకున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ దూ రదృష్టితో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని కోరారు. జోగుళాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల కు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, వైస్ ఎంపీపీ సు దర్శన్‌రెడ్డి, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, నేత లు, విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు.