మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబర్ 14 : ఈనెల 25వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో కోయిల్‌సాగర్ ఆ యకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో కోయిల్‌సాగర్ సాగునీటి సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. యా సంగి 2024-25 సీజన్ కు కోయిల్‌సాగర్ ప్రా జెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆ యకట్టుకు నీటి విడుదలకు సాగునీటి సలహా మం డలి సభ్యులు, రై తులతో కలిసి చర్చించి తీర్మానం చే సినట్లు కలెక్టర్ వెల్లడించారు. వారబందీ పద్ధతిలో ఈ నీటి విడుదల ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో పూడిక తీయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పెండింగ్ పనులపై చర్చించారు. కాల్వల నుంచి అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని వాడుకుం టే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, సాగునీటి ప్రాజెక్టు సీఈ రమణారెడ్డి, ఎస్ఈ చక్రధర్, కోయిల్‌సాగర్ ఈఈ ప్రతాప్‌సింగ్, మిషన్ భగీరథ ఈఈ వెంకటరెడ్డి, సాగునీటి, వ్యవసాయ, మిషన్ భగీరథ శాఖల అధికారులు, సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.