సాగు ప్రశ్నార్థకం
సంగబండ రిజార్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోవడంతో లోలెవెల్, హైలెవెల్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాటుకాల్వలు వట్టిపోవడంతో పంటలు ఎండు మొఖం పడుతున్నాయని ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు.
- కెనాల్ కాల్వలకు అందని సాగునీరు
- వట్టిపోతున్న కాల్వలు.. ఎండిపోతున్న పంటలు
- ఆందోళనలో రైతులు
- లో లెవెల్ కాల్వల నుంచి హై లెవెల్ కాల్వకు సాగునీటి పంపింగ్
- పంటలను కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు
- కాల్వలకు నీరందించాలని వేడుకుంటున్న రైతులు
మాగనూర్ మార్చి 29 : సంగబండ రిజార్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోవడంతో లోలెవెల్, హైలెవెల్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాటుకాల్వలు వట్టిపోవడంతో పంటలు ఎండు మొఖం పడుతున్నాయని ఆయకట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయకట్టులో వరి పంటలు పొట్టదశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మరో పక్క ఎండల తీవ్రత కూడా పెరగడంతో సాగునీటి సరఫరాపై రైతులను మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింది ప్రస్తుతం యాసంగిలో 12వేల ఎకరాలు వరిసాగు చేశారు. వానకాలంలో అయితే 50వేల ఎకరాల సాగు చేస్తారు.
సం గంబండ రిజర్వాయర్ ప్రాజెక్టు గేట్లు లీకేజీలతో సగం సాగునీరు వృథాగానే పోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోయాయి. లెఫ్ట్ హైలెవెల్ కాల్వకు పూర్తిగా సాగునీరు అందకపోవడంతో లెఫ్ట్ లోలెవెల్ కాల్వ నుంచి హైలెవెల్ కాల్వలోకి 5 మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తుండడంతో లో లెవెల్ కాల్వ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎం డిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో లోలెవెల్ కాల్వకు కూడా సాగునీరు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మరో పక్క కాల్వ వెంబడి వందల సంఖ్యలో రైతులు10హెచ్‌పీ మోటర్లు పెట్టి పంటలకు సాగునీరు పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క ప్రభు త్వం రైతులకు ఆందిస్తున్న 24కరెంట్‌ను 14గంటలు మాత్రమే చేసి అదికూడా 10గంటలు సరఫరా చేస్తుండడంతో సాగునీరు అం దడంలేదని వాపోతున్నారు. కరెంట్ సరఫరా లేని సమయంలో కాల్వ వెంబడి ట్రాక్టర్, జనరేటర్లు పెట్టి రైతులు సాగునీటి కోసం అదనంగా వేల రూపాయాలు ఖర్చు చేస్తున్నా పంటలు చేతికోస్తాయో లేదో ఆని ఆందోళన చెందుతున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికైనా రైతుల పంటలను దృష్టిలో ఉంచుకొని కృష్ణానదిలో వచ్చే నీటిని గోప్లాపూర్ పంపుహౌస్ నుంచి సంగంబండ రిజర్వాయర్‌కు విడుదల చేయించి వరి పంటలను కాపాడాలని మాగనూర్, కృష్ణ మండలాల రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

