Ground water level | మాగనూరు మార్చ్ 18 : మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండల వ్యాప్తంగా దాదాపు 75% రైతుల పంట పొలాలలో వేసుకున్న బోర్లలో ఎండాకాలం ప్రారంభ దశలోనే భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయని 24 గంటల కరెంటు ఇచ్చిన రైతులు వరి పంట సాగు కష్టమేనంటున్నారు.
వరి పంటలు పొట్ట దశలో చేతికొచ్చే సమయానికి వేసుకున్న బోర్లలో పూర్తిస్థాయిగా నీటిమట్టం పడిపోవడంతో బోర్లలో సాగునీరు అందక మోటార్లలో సాగునీరు రావడంలేదని అంటున్నారు. కాలువల ద్వారా నైనా సాగునీరు పెట్టుకుందామంటే సంబంధిత ప్రజా ప్రతినిధుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంగం బండ రిజర్వాయర్ కాలువలు ఉమ్మడి మండల వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క కెనాల్ కాల్వలో సగానికి సగం సాగునీరు కూడా రావడంలేదని.. సంగం బండ రిజర్వాయర్ రైట్ హై లెవెల్ కెనాల్, లెఫ్ట్‌లో లెవెల్ కెనాల్ కాల్వలలో అయితే చివరి ఆయకట్ట రైతులకు చుక్కనీరు రాక కాలువలు సైతం ఎండు ముఖం పడుతున్నాయి.
చివరి ఆయకట్ట రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతులు అంటున్నారు. సంగం బండ రిజర్వాయర్ ద్వారా సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు అనుకుంటే డ్యామ్‌లో కానీ కెనాల్ కాల్వలో కానీ మోటార్లు పెట్టి కాల్వలకు సాగునీరు అందిస్తే చివరి ఆయకట్ట రైతులకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సంగం బండ రిజర్వాయర్‌లో రైట్ హై లెవెల్ కెనాల్ కాల్వకు సాగునీరు అందకపోతే 20 హెచ్‌పీ మోటార్లు పెట్టి కాల్వలకు సాగునీరు అందించిన పరిస్థితి కూడా ఉందని ఇప్పుడు మాత్రం పంటలు ఎండుకపోతున్న ఏ ఒక్క అధికారికి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమని రైతులు వాపోతున్నారు.
తుంగను, పూడిక మట్టిని తీయకపోవడంతో..
అయితే సంఘం బండ రిజర్వాయర్ లెఫ్ట్‌లో లెవెల్ కెనాల్ కాల్వలో సంగం బండ సమీపంలో 40 లక్షల నిధులతో అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని తొలగించారు. కానీ కాలువలో పేరుకపోయిన తుంగను, పూడికపోయిన మట్టిని తీయకపోవడంతో ఓబులాపూర్ గేటు సమీపం వరకు కూడా సరిగ్గా సాగునీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాల్వలో పేరుకుపోయిన తుంగతో సాగునీరు సరిగా రావడం లేదని కాల్వలు నీరు లేక ఎండు ముఖం పడుతున్నాయంటున్నారు ఓబులాపూర్, వడ్వాట్ రైతులు. దీనివల్ల వడ్వాట్ గ్రామ సమీపంలో ఉన్న నరసింహ గౌడ్ పొలం దాదాపు మూడు నాలుగు గుంటలు బీటలు బారిన పరిస్థితి నెలకొన్నదని.. అలాగే వడ్వాట్ గ్రామానికి చెందిన కొంతమంది రైతుల పొలాలలో సాగునీరు లేక వరి పంటలు బీటలు బీటలు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాల్వలో మట్టి పేరుకుపోయిందని వాటిని తీస్తే తప్ప సాగునీరు వడ్వాట్ వరకు రావడం కష్టమని తెలుపుతున్నారు సంబంధిత అధికారులు. కాలువలో నీరు వదులుతే తప్ప పంటలు పండడం కష్టమని సాగునీరు విషయంలో అధికారులపై పంటలు ఆధారపడి ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.