వనపర్తి టౌన్: వచ్చే సీజన్లో రైతులు వరిపంటకు స్వస్తి పలికి మినులు ఇతర తృణదాన్యాల పంటల సాగును చేపట్టా లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మార్క్ఫెయిడ్ కార్యాలయాన్ని ఉన్న తాధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మార్క్ఫెయిడ్ అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్క్ఫెయిడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డైరె క్టర్లు విజయ్‌కుమార్, జగన్మోహన్రెడ్డి, రంగారావు, రాజశేఖర్‌గౌడ్, చరణ్, మార్క్ఫెయిడ్ ఎం.డి పాల్గొన్నారు.