నారాయణపేట టౌన్, ఏప్రిల్ 26: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి మానిటరింగ్ అసెస్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో సంతబజార్, వెజిటెబుల్ మార్కెట్ల ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని కమిటీ సభ్యులు సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో కమిటీ జిల్లా చైర్మన్(కలెక్టర్)హరిచందన, కన్వీనర్(అదనపు కలెక్టర్) చంద్రారెడ్డి, సభ్యులు జిల్లా ల్యాండ్ సర్వే అధికారి శ్రీరాం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
హీరోహీరోయిన్లకు బ్యాడ్ న్యూస్..అక్కడికి రాకపోకలు బంద్..!
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?