వనపర్తికి రెండు నూతన 33/11 సబ్ స్టేషన్లు మంజూరు
33/11 సబ్ స్టేషన్లు | వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు నూతన 33/11 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి రూ.163.41 లక్షలతో అడ్డాకుల మండలం పెద్ద మునగాల చేడ్లో రూ.222.57 లక్షలతో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి.

వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు నూతన 33/11 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి రూ.163.41 లక్షలతో అడ్డాకుల మండలం పెద్ద మునగాల చేడ్లో రూ.222.57 లక్షలతో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిపించి సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు కరెంట్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించేదని, బోర్లున్నా సకాలంలో కరెంట్ రాక రైతుల పొలాలు ఎండిపోయేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్ సమస్య మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల నాణ్యమైన కరంటు అందిస్తున్నామని తెలిపారు.
ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే ఈ ఏడేళ్ల కాలంలో 18 నూతన సబ్ స్టేషన్లు తీసుకువచ్చామని, కోతలు లేకుండా నాణ్యమైన కరంటు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

