అమరచింత, ఏప్రిల్ 19: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం అమరచింత మండలంలోని ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డితో కలిసి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 68 మంది రైతులు తమకు రూ.2 లక్షల లోపే బ్యాంకు లోను ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమకు రుణమాఫీ వర్తింపజేయాలన్నారు.