ఖిల్లా ఘనపూర్, మర్చి 6: దొంగతనాలను అరికట్టడంలో భాగంగా వనపర్తి జిల్లాలోని (Wanaparthy) ఖిల్లా ఘనపూర్ మండలంలో ఉన్న గ్రామపంచాయతీలు, తండాల్లోని 63 దేవాలయాలకు డిజిటల్ తాళాలు అమర్చారు. ప్రజలు కాడా తమ ఇండ్లకు డిజిటల్ తాళాలను బిగించుకోవాలని ఎస్ఐ సురేశ్ గౌడ్ సూచించారు. జిల్లా ఎస్పీ గిరిధర్ రావు సూచన మేరకు ఆలయాలకు డిజిటల్ తాళాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
ఖిల్లా ఘన్పూర్ మండలంలోని సోలిపూర్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. గ్రామంలోని సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ, అధికారులను మచ్చికచేసుకోని తప్పించుకుంటుండటంతో వలపన్నిన సీసీఎస్ సిబ్బంది.. బుధవారం రాత్రి 10.30 గంలకు మిల్లుపై దాడి చేసి బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈనేపథ్యంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.