వనపర్తి : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి కాలు విరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన సుదర్శన్ అనే వ్యక్తికి పత్తి మిల్లుకు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాలెం బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సుదర్శన్ కుడికాలు పూర్తిగా విరిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.