వనపర్తి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : తపస్సులా ప్రజా సేవను స్వీకరించి అభివృద్ధి పనులు చేప ట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అనేక పథకాలపై ప్రతిపక్షాలు అపోహలతో కాలం గడిపాయని, ఆ అపోహలన్నీ పటాపంచలు చేసి అభివృద్ధిని అందించి ప్రజలకు భరో సా కల్పించామని మంత్రి సింగిరెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో బీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు రావుల చంద్రశేఖర్రెడ్డ్డితో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో కూడా తెలంగాణ అంత తలసరి ఆదాయం లేదని, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్దరాష్ర్టాల్లో తలసరి ఆదాయం తెలంగాణ కంటే చాలా తక్కువగా ఉందన్నారు. కాంగ్రె స్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 30 నుంచి 40 ఏండ్ల సమ యం తీసుకునేవారని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్ల్లలో పూర్తి చేసి వ్యవసాయానికి పెద్దపీట వేశామని మంత్రి పేర్కొన్నారు.
దేశం లో ఏ రాష్ట్రం రైతులు, వ్యవసాయం కోసం ఖర్చు చేయనంతగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేసి రైతాంగానికి బాసటగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన జీవితకాలమంతా ప్రజలను మోసం చేయడమే సరిపో యిందని మంత్రి విమర్శించారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా దాదాపుగా 40ఏండ్ల పాటు నిర్మాణా లు చేపట్టి కాంగ్రెస్ కాలం గడిపేందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన జూరాల ప్రాజె క్టు ఇందుకు ఉదాహరణ అన్నారు. ఒక్కొక్క రాష్ట్రం లో ఒ క్కో విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని, పేరుకు జాతీయ పార్టీగా చెప్పడం మినహా ప్రాంతీ య పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అన్ని రాష్ర్టాలకు ఒకే విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు.
నిర్ధిష్టమైన ప్రణాళిక ఉంది : రావుల
బీఆర్ఎస్ పార్టీకి నిర్ధిష్టమైన ప్రణాళిక ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన రావుల తొలిసారి వనపర్తి బీఆర్ఎస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ పట్టుదలగా వ్యవహరించిందన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. పట్టణంలోని రోడ్ల విస్తరణ సాహసోపేతంగా చేపట్టారని రావుల గుర్తు చేశారు. గతంలో తాము ఇద్దరం కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని, ఇద్దరికి అవగాహన ఉందని రావుల వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోనూ, రాజకీయంగాను కలిసి పనిచేశామన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజల ముం దుంచుతామని, మరోసారి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని రావుల ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులంతా బీఆర్ఎస్ నాయకత్వంలో కలిసిపోయి ఐక్యంగా పని చేసుకుంటామని రావుల భరోసా ఇచ్చా రు.
రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరముందని రావుల పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్, బీఆర్ఎస్ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌రెడ్డి, శిక్షణా తరగతుల కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పలుస రమేశ్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు మాణిక్యం, నందిమళ్ల అశోక్, నందిమళ్ల రమేశ్, రమేశ్ చంద్ర, ఉంగ్లం తిరుమల్, నందిమళ్ల శ్యాం, సత్యారెడ్డి, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.