గద్వాల, జనవరి 23 : ప్రతి సంక్షేమ పథకంతోపా టు రేషన్, బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు, భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, హెల్త్‌కార్డు ఇలా ప్రతి దానికి ఆధార్ త ప్పనిసరి కావడంతో దానిని పొందడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆధార్ అన్నింటికీ లింక్ ఉండడంతో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి అయ్యింది. గత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కా ర్డులతో ఏదైనా పథకానికి అనుసంధానం చేయడానికి వెళితే అది పని చేయకపోవడంతో దానిని అప్డేట్ చే సుకోవడానికి లబ్ధిదారులు ఆధార్ సెంటర్ల దగ్గరకు వస్తే అక్కడ సెంటర్లన్నీ లబ్ధిదారులతో కిటకిట లాడుతుండడంతో గంటల కొద్ది వేచి ఉన్నా ప్రజలకు పని అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం రేషన్ బియ్యానికి సంబంధించి లబ్ధిదారులు ఆధార్ తీసుకొని దుకాణాలకు వెళితే అక్కడ లబ్ధిదారుల వివరాలు చూపడం లేదు. చిన్నారులకైతే ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే బియ్యం వస్తుండడంతో రెండు నెలలుగా ఆధార్ అప్డేట్ కోసం లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆరు గ్యా రెంటీలైనా బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇతర వాటికి ఆధార్ తప్పనిసరి చేయడంతో అందరూ ఆధార్ సెంట ర్ల దగ్గర పడిగాపులు గాస్తున్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలో మూడు ఆధార్ సెంటర్లు మాత్రమే ఉండడంతో వాటి దగ్గర ఉదయం ఆరు నుంచి రాత్రి 9 గం టల వరకు ఆధార్ అప్డేట్ కోసం అక్కడే ప్రతి సెంటర్ వద్ద వందకు పైగా లబ్ధిదారులు సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రా ల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారులు జిల్లాకేంద్రానికి వస్తే ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి తోడు ప్రతి ఆధార్ సెంటర్లో నిత్యం 50 మందికి మిం చి అప్డేట్ కాకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం తాత్కాలికంగానైనా ప్రభుత్వ పరిధిలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు డి మాండ్ చేస్తున్నారు. ఆధార్ సెంటర్ల వద్ద సందులో సడేమియా అన్నట్లు తమ అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న నిర్వాహకులు ప్రతి ఆధార్ అప్డేట్ కోసం రూ.100 వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. అత్యవసరంగా చేయాలంటే మరింత చేతివా టం ప్రదర్శిస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జో గుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆధార్ అప్డేట్ కో సం అయిజ, వనపర్తి జిల్లా కొత్తకోట తదితర ప్రాంతా ల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడే నిద్రించి ఉద యం లేచి వరుసలో నిలబడుతున్నారు. ఆధార్ కష్టాలకు ప్రభుత్వం చెక్‌పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మాది కొత్తకోట. ఆధార్ అప్డేట్ కోసం గద్వాలకు వచ్చాం. అయితే లబ్ధిదారు లు ఎక్కువగా ఉండడం మొదట వచ్చిన 50మంది కి మాత్రమే ఆధార్ అప్డే ట్స్ చేస్తామని చెప్పడంతో సమయం అయిపోయిం ది. ఏమి చేయలేక ఇక్కడే ఉండిపోయాం. ఉదయం వరుసలో నిలబడితే తమ వంతు వస్తుందని రాత్రి చలిలో ఇక్కడే పడుకున్నాం. ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. ప్రభుత్వం సెంటర్లు పెంచితే బాగుండేది.
ప్రస్తుత ప్రభుత్వాలు ప్ర తి పథకానికి ఆధార్ లింక్ చేయడంతో తప్పని పరిస్థితిలో ఆధార్ అప్డేట్ చే యించుకోవాల్సి వస్తుంది. మా వద్ద సెంటర్లు తక్కువగా ఉన్నాయని ఇక్కడికి వస్తే ఇక్కడా అదే పరిస్థితి. ప్రతి సెంటర్ దగ్గర వంద కు పైగా లబ్ధిదారులు ఉం టున్నారు. మొదట దరఖా స్తు ఇచ్చిన వారిదే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. అం దుకోసం మొదట దరఖాస్తులు ఇవ్వడానికి రాత్రి ఇ క్కడే ఉన్నాం. ఈ రోజైనా మా పని అయిపోతుందో లేదో. రేషన్ దుకాణానికి వెళితే పిల్లలది ఆధార్ అప్డేట్ అడుగుతుంది. చేయకపోతే రేషన్ రాదని భయపెడుతున్నారు.