వనపర్తి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఇక రుణమాఫీ పూర్తి చేశాం.. మిగిలిన నాలుగో విడుతను విడుదల చేశాం.. అంటూ ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటనలు గుప్పించారు.. గత నవంబర్ 28, 29, 30 తే దీల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో చి వరి రోజున సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ సమీపంలోని అమిస్తాపూర్‌లో నిర్వహించిన సభలోనూ రుణమాఫీని ప్రకటించిన సంగతి విధితమే. జిల్లా పరిధిలోని 14 మండలాల్లో 4వ విడుతల్లో దాదాపు రూ.48.79 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. దీ నికి సంబంధించి 5,366 మంది రైతులకు రుణమాఫీ కింద ఈ డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఇదివరకు మూడు విడుతల్లో జిల్లాలో 53,640 మంది రైతులకు రూ.426.76 కోట్లు రుణమాఫీ అయ్యింది.
బ్యాంకుల చుట్టూ చక్కర్లు
నాలుగో విడుత రుణమాఫీ లిస్టులో పేర్లున్నాయని తెలుసుకున్న రైతులు బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. ఏకంగా సీఎం ప్రకటించడంతో తమకు డబ్బులు న మ్మకంగా పడి ఉంటాయన్న ఆశతో రైతులు వెళ్లి నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. బ్యాంక్ మేనేజర్లు డబ్బులు రాలేదని చెబుతుండడంతో అయోమయాని కి గురవుతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అన్నదాతలకు దాపురించింది. సీఎం, మంత్రు లు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ప్రకటనలు చేశారు త ప్పా.. ఆచరణలో రుణమాఫీ వందశాతం కాలేదని రైతులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మాఫీ ప్రకటన వెలువడినప్పటి నుంచి బ్యాంకు మేనేజర్లకు రైతులతో తలనొప్పిగా మారింది. ఒక్కొక్క రైతు పదే.. పదే బ్యాంకుకు వచ్చి అడుతుండడం వల్ల బ్యాం కు సిబ్బంది విసుగెత్తుతున్నారు.
ఉద్యోగులను గుర్తించాలి..
రుణమాఫీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కిందిస్థాయి ఉద్యోగులకు ఈ సూచన చేస్తున్న క్రమంలో ఉద్యోగులు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. లిస్టుల్లో పేర్లు వచ్చిన తర్వాత తొలగించడం ఇబ్బందికరంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితిలో గ్రామస్థాయిలో ఉద్యోగులు వెళ్లి తొలగిస్తాం అనే ప్రస్తావన తీసుకురావడం అంత సు లువైన పనికాదు. పలు దఫాలుగా ఉద్యోగులను గు ర్తించాలని ఒత్తిళ్లు చేస్తున్నా.. కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం తమతో కాదని పట్టించుకోవడం లేదు. దీం తో ఈ ప్రక్రియ ఎటూ తేలకుండా పోతున్నది. ముం దు నుంచి విధివిధానాలు పట్టించుకోకుండా ఇప్పుడు నాలుగో విడుతలో ఉద్యోగులను గుర్తించాలనడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే.. కొన్ని చోట్ల కొం దరు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రుణమాఫీ అయ్యిం ది. దీనిపైనే ఎటూ తేల్చుకోలేక ప్రభుత్వం మళ్లగుల్లా లు పడుతున్నట్లు తెలుస్తున్నది.
అంతా సందిగ్ధం..
నాలుగో విడుత రుణమాఫీకి సంబంధించి అంతా సందిగ్ధం అన్నట్లుగానే ఉంది. ఏ అధికారిని అడిగినా తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. ఆడంబరం గా ప్రకటనలు.. ఉత్తేజంగా ప్రజాపాలన సంబురాలు నిర్వహించిన ప్రభుత్వం ఉన్నట్లుండి చివరి విడుతను పెండింగ్ పెట్టేయడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎవరు కూడా క్లారిటీగా ఇవ్వలేక పోతున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు ప్రభుత్వ అధికారులు కూడా స్పష్టమైన సమాచారాన్ని అందించడంలో వెనుకాముందు అవుతున్నారు. దీనికంతటికి కారణం ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడమేనన్న వాదన వినిపిస్తున్నది. ఈ క్రమంలో బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ మాఫీ లిస్టులో ఉన్న రైతులు ఆందోళనతో పరుగులు పెట్టక తప్పడం లేదు.
రుణమాఫీ డబ్బులు జమకాలేదు..
నాకు అమరచింత యూ నియన్ బ్యాంకులో రూ. లక్షా 26 వేల అప్పు ఉంది. నాలుగో విడుత రుణమాఫీ లిస్టులో నా పేరుంది. ఇప్ప టి వరకు నా అకౌంటులో డ బ్బులు జమకాలేదు. బ్యాం కు చుట్టూ తిరిగి తిరిగి వేసా రి పోతున్నా. అధికారులు సమాధానం చెప్పాలంటే కూడా విసుక్కుంటున్నారు. స్వయంగా సీఎం పాలమూరుకు వచ్చి చెప్పి కూడా చాలా రోజులైంది. అయినా ఇంకా డబ్బులు రాలేదు.
– శ్రీకాంత్, రైతు, అమరచింత
రూ.40 వేలు వడ్డీ కట్టినా..
అమరచింత యూనియ న్ బ్యాంకులో నాకు రూ.2లక్షల 40వేలు పంట రుణం ఉంది. మూడు విడుతల్లో రుణమాఫీ రాలేదు. చివరలో మాఫీ వస్తుందని వ్యవసాయ అధికారులు ఫొటోలు తీసుకున్నారు. నా రుణంలో రూ.2 లక్షలకుపైగా ఉన్న రూ.40 వేలు కట్టమని చెబితే కట్టేశాను. నాలుగో విడుత లిస్టులో పేరైతే ఉంది. కానీ డబ్బులు మాత్రం అకౌంట్లో పడలేదని అధికారులు చెబుతున్నారు. ఈ రుణమాఫీ మాకు గొంతులో ముల్లు ఇరుక్కున్నట్లుగా ఉంది.
– ఆంజనేయులు, రైతు, అమరచింత
ఇంకా రుణమాఫీ కాలేదు..
నాకు 4.02 ఎకరాల ప ట్టా భూమి ఉండగా మూ డేండ్ల కిందట మండలకేంద్రంలోని ఎస్బీఐలో రూ.1,80,000 వ్యవసాయ రుణం పొందాను. నిర్దిష్ట సమయానికి క్రమం తప్పకుండా రుణాన్ని రెన్యువల్ చేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో నాకు రుణమాఫీ కాలేదు. బ్యాంక్‌లో సరైన ధ్రువపత్రాలు ఇచ్చినప్పటికీ నాలుగో విడుత రుణమాఫీలో కూడా లిస్టులో నాపేరు రాలేదు. కొందరికి లిస్టులో పేర్లు వచ్చినివి, కానీ అకౌంట్లలో డబ్బులు జమకాలేదు.
– మడిగ నర్సింహ, మాధవరావుపల్లి, పాన్‌గల్ మండలం