ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
- కలెక్టర్ రవినాయక్
మహబుబ్‌నగర్, మే 9: ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాబితాలో చేర్చాల్సిన పేర్లు పొరపాటున చేర్చకపోవడం, తొలగించాల్సిన పేర్లు తొలగించకపోవడం వంటివి జరిగితే అలాంటి వివరాలను రాజకీయ పార్టీలకు సమర్పిస్తే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ప్రతివారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా తదితర అంశాలకు సంబంధించిన సమావేశం ఉంటుందన్నారు. ఓటరు జాబితాలో కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తదితరాలకు వచ్చిన అభ్యంతరాల వివరాలను వివరించారు. వీటితోపాటు ఆధార్ నెంబర్లు అప్‌లోడ్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 76శాతం పూర్తయిందన్నారు. మిగతా వాటిని తెప్పించి అప్లోడ్ చేయిస్తామన్నారు. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని జిల్లాస్థాయి ఏజెంట్ల వివరాలు సమర్పిస్తే ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై సులభంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి సత్యంయాదవ్, బీజేపీ నుంచి అంజయ్య, టీడీపీ నుంచి మురళి, చెన్నయ్య, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు అఖిలప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

