రెండు గ్రామ పంచాయతీలను ఒకటిగా చేస్తారన్న ప్రచారం ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మా గ్రామ పంచాయతీ మాకు ఉండాల్సిందే. మా పంచాయతీని మరొక గ్రామంలో విలీనం చేస్తే ఒప్పుకోమంటూ నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నారు. చిలికి.. చిలికి గాలి వానలా మారుతున్న ఈ విలీనం ప్రతిపాదన రాజకీయ వైశ్యమ్యాలకు దారితీస్తున్నది. పెద్దమందడి మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి గ్రామ పంచాయతీలను విలీనం చేసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది.
– వనపర్తి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అంతకు ముందు జంగమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం, గ్రామ పంచాయతీగా కొనసాగడం జరిగింది. ఈ రెండు గ్రామాలకు మధ్యలో కేవలం రోడ్డు మాత్రమే హద్దుగా ఉంటుంది. గ్రామాలు దాదాపుగా కలిసే ఉంటాయి. అయితే రెవెన్యూ పరంగా అంతా వేర్వేరుగా ఉండడం, గ్రామ పంచాయతీల వ్యవస్థను గత సీఎం కేసీఆర్ ప్రోత్సహించడంతో బలిజపల్లిని కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. తొలి గ్రా మ సర్పంచుగా జయంతి ఎన్నిక కాగా, అలాగే జంగ మాయిపల్లికి సతీశ్ సర్పంచ్‌గా ఎన్నిక కాగా, వారి పద వీ కాలం కూడా ముగిసింది. ఈమేరకు కొత్తగా జీపీ అయిన బలిజపల్లికి కావాల్సిన కొన్ని అభివృద్ధి పను లను కూడా చేయించుకున్నారు. బలిజపల్లి జనాభా 2,691 ఉంటే, జంగమాయిపల్లి జనాభా 1,732 ఉం ది. ఇలా వీరిద్దరి మధ్య సుమారు వెయ్యి జనాభా తేడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన అభివృద్ధి నిధుల మంజూరులను చేస్తుండటం విధితమే.
ప్రత్యేక గ్రామ పంచాయతీగా కొనసాగిన బలిజపల్లిని మళ్లీ జంగమాయిపల్లి జీపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాము అంగీకరించబోమని బలిజపల్లి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు విన్నవించడం, ధర్నాలు, రిలే నిరసన దీ క్షలను కొనసాగిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తు న్నారు. నాలుగురోజులుగా గ్రామంలో దీక్షలను చేస్తూ విలీనం తమకు వద్దని పట్టుపడుతున్నారు. ముందుగా రోడ్డుపై ధర్నాకు దిగిన క్రమంలో తాసీల్దార్, ఆర్డీవో, డీఎస్పీ లాంటి అధికారులు వెళ్లి సర్ది చెప్పారు. అయితే తమ నిరసనను దీక్షల ద్వారా కొనసాగిస్తామని క్రమం గా ముందుకు నడుస్తున్నారు. విలీనాన్ని అడ్డుకు నేందుకు ఎంతవరకైనా సరే అన్నట్లు గ్రామస్తులు ఏకాభిప్రాయంతో కదులుతున్నారు.
బలిజపల్లి-జంగమాయిపల్లి గ్రామాలను ఒకే గ్రామ పంచాయతీ పరిధిలోకి తెస్తూ నూతన మండలంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. ఈ క్రమంలోనే జంట గ్రామాలుగా ఉన్న బలి జపల్లి, జంగమాయిపల్లికి గతంలో నుంచి కొంత సరి హద్దు సమస్య ఉంది. రెవెన్యూ పరంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ సరిహద్దుల వ్యవహరంలో గతంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచు కొని రెండు గ్రామాలను ఒకే గ్రామ పంచాయతీగా చేసి ‘మంజునాథపురం’ అన్న పేరుతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నం ప్రభుత్వ పరిశీ లనకు వెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న బలిజపల్లి గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీని ఎట్టి పరిస్థితిలో జంగమాయిపల్లిలో విలీనానికి అంగీకరించబోమని భీష్మించుకున్నారు. మండల కేంద్రం ఏర్పాటైతే తమకు సంతోషమేనని, జీపీ విలీనం మాత్రం కుదరదని పట్టు దలతో ఉన్నారు.
బలిజపల్లి, జంగమాయిపల్లి గ్రామాల విలీనంపై అభి ప్రాయాలు సేకరణకు జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వ ర్యంలో అధికారులు రెండు వేర్వేరుగానే గ్రామ సభలను నిర్వహించేందుకు శుక్రవారం ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల సంతకాలతో కూడిన నోటీసులను గ్రామ పంచాయతీలకు అంద జేశారు. ఉదయం 8గంటలకు బలిజగ్రామ సభ, అనం తరం పది గంటలకు జంగమాయిపల్లి గ్రామ సభ నిర్వ హించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గ్రామపంచాయ తీలకు ప్రత్యేక అధికారిణిగా పెద్దమందడి ఎంపీవో పుష్పలత ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించ బోతు న్నారు.
ఇదిలా ఉంటే బలిజపల్లి గ్రామస్తులు సభను సీరియస్‌గా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామస్తులందరిని ప్రత్యేకంగా గ్రామసభను దృష్టిలో ఉంచుకుని పిలు పించుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు, మూడు వందల మంది వరకు బయట ఉన్న గ్రామస్తులు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు గ్రామాల మధ్య విలీనం ప్రతిపాదన ఉద్రిక్తంగా మారు తున్న వేళ అధికార యంత్రాంగం అప్రమత్తం కావా ల్సిన అవసరం ఉంది. సభల సందర్భంగా తగిన జా గ్రత్తలు తీసుకోవడం సముచితం.
గతంలో కలిసి ఉన్న రెండు గ్రామాలను విలీనం చేసి మండలకేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఏ ప్రతిపాదన చేసినా ప్రజల సౌకర్యం కోసమే ఉంటుంది. జీపీలుగా వేర్వేరుగా ఉండటం వల్ల సరిహద్దు సమస్యలున్నాయి. ఒకే పంచాయతీ పరిధిలో ఉండటం ద్వారా సమస్యలు రాకూడదన్నదే ఉద్దేశం. తప్పుగా అర్థం చేసుకుని వ్యక్తిగత రాజకీయం అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో మండల కేంద్రానికి వెళ్లడానికి గ్రామస్తులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసిన వాళ్లకు అర్థమవుతుంది. విలీనానికి ఏకాభిప్రాయం వస్తే సరి. రా కున్నా మండల ఏర్పాటు ఆగదు. మండల కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించిన ఎమ్మెల్యే కృతజ్ఞతలు
– రమేశ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ, బలిజపల్లి, వనపర్తి జిల్లా
మా గ్రామ పంచాయతీని జంగమాయిపల్లిలో విలీనం చేయడాన్ని మేం అంగీకరించం. గ్రామం మొత్తం ముక్తకంఠంగా చెబుతున్న అభిప్రాయమే నేను చెబుతున్నా. ఏ ఒక్కరికీ ఇష్టం లేదు. గతంలో రెండు గ్రామాల మధ్య ఉన్న వైశ్యమ్యాల ను తొలగించాలని గత బీఆర్ఎస్ ప్రభు త్వం వేర్వేరుగా జీపీలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక జీపీ ద్వారా అనేక నూతన అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఇంత చేసుకున్న తర్వాత మళ్లీ రెండు జీపీలను విలీనం చేసి తగవులు పెట్టడం తప్పా మరొకటి లేదు. గ్రామ సభ తీ ర్మానం లేకుండానే విలీనం ప్రతిపాదన వెళ్లిం ది. దీన్ని మేం ఒప్పుకునేది లేదు. మండలం ఏర్పాటు చేస్తే సంతోషిస్తాం.
– డాక్టర్ జయంతి, మాజీ సర్పంచ్, బలిజపల్లి, పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లా