అయిజ రూరల్, మార్చి 2 : మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో 2023-24 సంవత్సరం లో జరిగిన ఉపాధిహామీ పనిలో భారీగా అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి తల్లి కుటుంబ స భ్యులతో కలిసి అయిజ పట్టణంలో జీవిస్తున్నాడు. అయితే ఉపాధ్యాయుడి రేషన్‌కార్డును ప్రభుత్వం గతంలో స్వా ధీనం చేసుకున్నది. అయితే ఉపాధ్యాయుడి తల్లి ఖాజాబీ పేరుతో ఉపాధిహామీ జాబ్‌కార్డును ఫీల్డ్ అసిస్టెంట్ మురళి సృష్టించాడు. 85 ఏండ్ల వయసులో నడవలేని స్థితిలో ఉ న్న ఖాజాబీ ఉపాధి కూలీగా పని చేసినట్లు రికార్డులు సృ ష్టించి పెద్ద మొత్తంలో ఆమెకు తెలియకుండా నగదు డ్రా చేశాడు.
ఉపాధిహామీ కూలీ వాస్తవంగా వందరోజులు ప ని చేయాల్సి ఉండగా ఏకంగా 190 రోజులు పనిచేసినట్లు మ స్టర్లో నమోదు చేశాడు. 2021నుంచి 2025 వరకు రూ.1,37,876) ఆమెకు తెలియకుండా డబ్బులు డ్రా చే శారు. కాగా రెండు రోజుల కిందట ఉపాధిహామీ గ్రామసభ జరగగా విషయం బయటకు పొక్కింది. గ్రామస్తులు ఖా జాబీ కుమారుడైన రఫీకి విషయం తెలుపడంతో ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన పనికి తన ఉద్యోగానికి ఎసరు వస్తుందని భ యాందోనకు గురవుతున్నాడు. ఇదే తరహాలో మరో 10మంది పేర్ల తో జాబ్‌కార్డులు సృష్టించి పె ద్ద ఎత్తున డబ్బులు డ్రా చేశాడని గ్రామస్తులు తెలిపారు. ఇం దులో గ్రామస్థాయి నుంచి మండలస్థాయి ప్రజాప్రతినిధుల పేర్లతో జాబ్‌కార్డులు ఉన్నట్లు సమాచారం.
నాకు 85ఏండ్ల వయసు. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. నాకొడుకు, కోడలు సాయంతో నావ్యక్తిగత పనులు చేసుకుంటున్నాను. నేను ఎలాంటి ఉపాధి కూలీ పని చేయలేదు. నా పేరు మీద జాబ్‌కార్డు సృష్టించి ఫీల్డ్ అసిస్టెంట్ పెద్ద మొత్తంలో నగదు డ్రా చేశాడు.
చిన్నతాండ్రపాడు గ్రామ ఉపాధిహామీ పనులలో జ రిగిన అవకతవకలు నా దృష్టికి రాలేదు. ఈనెల 4న అయిజ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోషల్ ఆడిట్ ఉంటుంది. విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకొని నగదు రికవరీ చేస్తాం.
-డీఆర్డీవో నర్సింగరావు (అడిషనల్ కలెక్టర్)