మాగనూరు : గ్రామంలో అక్రమంగా అమ్ముతున్న కల్తీ కల్లు ( Adulterated toddy) , బెల్టు షాపుల( Belt Shops) మూసివేతకు నారాయణపేట జిల్లా మాగనూర్ గ్రామస్థులు తీర్మానం ( Villagers resolution ) చేశారు. సోమవారం గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మాగనూరు మండల కేంద్రంలో అక్రమంగా చట్టానికి విరుద్ధంగా అమ్ముతున్న కల్తీ కల్లును , బెల్టుషాపుల రద్దుకు అన్ని కులాలకు సంబంధించిన నాయకులు , యువకులు, గ్రామ పెద్దలు తీర్మానం చేశారని స్థానిక ఎస్సై అశోక్‌బాబుకు తీర్మాన ప్రతిని అందజేశారు. మాగనూరులో ఇప్పటి నుంచి అక్రమంగా కల్తీకల్లు, బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.