అచ్చంపేట/బల్మూరు, జనవరి 20 : నల్లమలలో లభించే విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన కా ర్పొరేట్ శక్తులు, మైనింగ్ మాఫియా ఆగడాలపై గ్రా మస్తులు భగ్గుమన్నారు. ముఖ్యముంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిపెరిగిన సొంత నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలోని మై లారం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెల కొన్న ది. గ్రామానికి ఆనుకొని ఉన్న పలుగురాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడిసరుకును (తెల్లరాయిని) వెలికితీసే పనులు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్ కంపెనీ పోలీ సులు, ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభిం చింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు మైనింగ్ వ్యాపారులకు అండగా నిలిచాయి. దీంతో పనులను అడ్డుకునే ప్రయత్నం చేసిన గ్రామస్తులపై పోలీసులు కేసులు పెట్టారు. మైలారం గుట్టను మైనింగ్ వెలికితీతకు 2017లో మైనింగ్ తవ్వకాలకు అను మతిపొందారు.
కానీ గ్రామస్తులు అనుమతులను వ్యతిరేకించడంతో ఎలాంటి పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మైనింగ్ వ్యాపారస్తులు మళ్లీ పనులు షురూ చేశారు. నాటి నుంచి గ్రామస్తులు శాంతియుతంగా నిరసన కార్య క్రమాలను చేస్తూనే వచ్చారు. గ్రామస్తులు, ప్రజా సంఘాలు మొదటి నుంచి మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకంగా అందోళనలు చేస్తున్నారు. ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్క రించారు. అధికారులు వెళ్లి గ్రామస్తు లను నచ్చజెప్పి పో లింగ్ జరిగేవిధంగా చూ సిన గ్రామస్తులు పెద్దగా పోలింగ్‌లో పాల్గొనలేదు. దీంతో కొన్ని నెలలుగా పోలీసుల రక్షణలో తవ్వకాలు జరుపుతున్నారు. గతంలో అనేకసార్లు గ్రామస్తులు, ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో సమావేశాలు పెట్టి, ఆందోళనలు చేశారు. పనులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై పో లీసులు కేసు నమోదు చేశారు.
ప్రజల అనుమతి లేకుండా, ప్రజాభిప్రాయం సేకరణ జరుపకుండా కొ నసాగుతున్న మైనింగ్ పనులను ఆపలేకపోయారు. మైనింగ్ తవ్వకాలు నిలిపివేసి మాగుట్టను కా పాడాలని మైలారం గ్రామస్తులు హైకోర్టులో ఫి ర్యాదు చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న పలుగు రాళ్లగుట్ట కళ్ల ముందే మైనింగ్ మాఫియాకు బలైపో తుంటే గ్రామస్తులు జీర్ణించుకోవడం లేదు. ఇక తమ ఆందోళనను ఉధృతం చేసి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సోమవారం నుంచి వారంరోజులపాటు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు దీక్షలను అడ్డుకునే క్రమంలో ముందస్తుగా తెల్ల వారుజామున 5 గంటలకు గ్రామంలోకి ప్రవేశించి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులను అదుపు లోకి తీసుకొని కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వెల్దండలో ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టు
వెల్దండ, జనవరి 20 : మానవ హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ను వెల్దండ పోలీసులు అరెస్ట్ చేశారు. బల్మూర్ మండ లం మైలారంలో మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న హరగోపాల్ సోమవారం హైదరాబాద్ నుంచి మైలారం వెళ్తుండగా వెల్దండలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గంటపాటు స్టేషన్లో ఉంచి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దీంతో ఆయన బల్మూర్ వెళ్లకుండా వెల్దండ నుంచే హైదరాబాద్‌కు వెనుదిరిగారు. అయితే ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని మానవ హ క్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.
మైనింగ్‌కు వ్యతిరేకంగా..
బల్మూరు మండలం మైలారం శివారులో మైనింగ్ పనులను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉ న్నాయి. కొన్ని నెలలుగా పనులను ఆపాలని అడ్డుకుంటున్న వారిపై కేసులు నమోదు చేశారు. అధికారులు, ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శాంతియుతంగా నిరసన రిలే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు తెల్లవారుజాము 5 గంటలకే గ్రామానికి చేరుకొన్నారు. ఉదయం నుంచి పొలాల వద్ద.. ఇండ్ల వద్ద ఉన్న పలువురుని అదుపులోకి తీ సుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్ర హం వ్యక్తం చేస్తూ గ్రామంలోకి పోలీసులు రాకుం డా ప్రధాన రోడ్లపై కంపచెట్లు.. కట్టెలను వేశారు.
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకొన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బల్మూరు స్టే షన్లో ఐదుగురిని, అచ్చంపేట పీఎస్‌లో ఒకరిని ఉం చారు. అయి తే కాంగ్రెస్ నేత బాలాగౌడ్‌ను విడుదల చేసి మిగితా వారిని స్టేషన్లోనే ఉంచడంపై ధ్వజమెత్తారు. ఎ మ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరు ఎస్సై ర మాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు ఏర్పా టు చేశారు. లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల ఎస్సైలు, పోలీసులు గ్రామంలో మొహరించారు. అయినా భయపడకుండా.. మా ప్రాణాలుపోయినా మైనింగ్‌ను ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. పనులను జరగనివ్వమని, ఎలాగైనా అడ్డుకొని తీరుతామ ని హెచ్చరించారు. మా ఊరును మేమే కాపాడుకుంటాం.. మాకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై శాపనార్థాలు పెట్టారు. తవ్వకాలు నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించగా.. తోటి వారు అడ్డుకున్నారు. నిరసన తెలియజేస్తున్న మరో మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయింది. వెంటనే పోలీసులు గ్రామాన్ని విడిచి వెళ్లాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావర ణం నెలకొన్నది. గ్రామ సభ అనుమతి లేకుండా మైనింగ్ ఎలా జరుపుతారని నిలదీశారు. ఎవరొచ్చినా.. మా ప్రాణాలు పోయినా మైనింగ్ తవ్వకాలు జరగనివ్వమని తెగేసి చెప్పారు. ఎన్నికల్లో వంశీకృష్ణ గెలుపునకు గ్రామమంతా ఏకమై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నేడు మా చావును ఆయన కోరుతున్నారని ఆగ్రహం చెందారు. అనంతరం అచ్చంపేట సీఐ రవీందర్ వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. వారు ససేమిరా అనడంతో చేసేది లేక అరెస్టు చేసిన వారిని వదిలి పెట్టారు. దీంతో గ్రామస్తులు శాంతించి రోడ్డుపై వేసిన కంపను తొలగించారు.
గుట్టపై అడ్డంగా టిప్పర్
మైలారం గ్రామంలో జరుగుతున్న మైనింగ్ పనులను ఫొటో కవరేజ్ కోసం వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మాఫీయా అడ్డుకున్నది. అక్కడ పనులు చేస్తున్న సిబ్బంది మీడియాపై చిందులు వేశారు. పని వద్దకు వెళ్లకుండా గుట్టపై అడ్డంగా టిప్పర్‌ను ఉంచారు. మీడియాకు అనుమతి లేదంటూ దురుసుగా వ్యవహరించారు.
ప్రజల చావులు కోరుతున్నారు..
2009 నుంచి అచ్చంపేట ప్రాంతనికి చెందిన వ్యక్తి ఓడిపోవడం జరుగుతుందని వంశీకృష్ణపై సానుభూతితో గ్రామంలో యు వకులు, మహిళలు పార్టీలకు అతీతంగా ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన 2024 నుంచి గ్రామంలో మైనింగ్ మాఫీయకు అం డగా ఉంటూ సానుభూతితో పనిచేసిన ప్రజ లు చావులు చూడాలనుకోవడం బాధాకరంగా ఉంది. అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేశామా అని ఇప్పుడనిపిస్తున్నది.
-గుండాల గాయత్రి, గ్రామస్తురాలు, మైలారం
మైనింగ్ పనులు ఆపాలి..
మైనింగ్ పనులకు అప్పటి ఉమ్మడి గ్రామ పంచాయతీయే కారణం. ఎందుకంటే మైనిం గ్ సిబ్బందితో అప్పటి అనంతవరం ప్రజాప్రతినిధులు రూ.50లక్షలు తీసుకొని అనుమతులు ఇచ్చారు. దీంతో వారు యథేచ్ఛగా మైనింగ్ పనులు ప్రారంభించడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మా ఇండ్లన్నీ పాడవుతున్నాయి. వీటిని ఆపాలని కోరుతున్న వారిపై పోలీ సు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వమైనా స్పందించి మైనింగ్ పనులు ఆపాలి.
-బాలయ్య, గ్రామస్తుడు, మైలారం