అలంపూర్ చౌరస్తా, మార్చి 28 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబుకు ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాజోళి మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంతో వ్యవసాయం, పశుపక్షాదులతోపాటు మనుషులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అందుకే వెంటనే ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరారు. దీంతో మంత్రి స్పందించి మాట్లాడుతూ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.