మక్తల్ టౌన్, జూన్ 2 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెకింపులో కాంగ్రెస్ అభ్యర్థిపై బీ ఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడం యావత్ రాష్ర్టాన్ని సంతోషపెట్టిందన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసిన ఎంపీటీసీలు, ఎంపీపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పతనం పాలమూరు నుంచే ప్రారంభమైందని.. త్వరలోనే ఆ పార్టీకి ఎ దురుదెబ్బ తగులుతుందన్నారు. అధికారం కోసం అలివి కాని హామీలిచ్చి.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. రాష్ట్రాభివృద్ధిని పకనపెట్టి స్వలాభం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం రోజునే బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిం చి రాష్ట్రంలో కేసీఆర్ మార్క్‌ను చూపించారన్నారు.