మూసాపేట : చిన్న చింతకుంట మండలంలోని బండారుపల్లి గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ( Kalyanotsavam ) నేత్రానందంగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంబంతో స్వాగతం పలికారు.
ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కల్యాణోత్సవాలు జరుగుతున్నాయి, వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య గణపతి పూజ, అంకురార్పణ , పుణ్యహచనము, అఖండ దీపారాధన, గజారోహణము తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. కల్యాణోత్సవం, రథోత్సవం, 500 మంది దంపతులతో యజ్ఞాది కార్యక్రమాలు ఆలయ సంస్థాపకులు శ్రీ శ్రీ సదానంద ఈశ్వరుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ రాజేశ్వరి రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దశరథ రెడ్డి, మాజీ సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.