పనుల్లో వేగం పెంచాలి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను గురువారం మంత్రి పరిశీలించారు.
- జూన్ 2న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, స్లాటర్‌హౌస్ ప్రారంభం
- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, మే 11 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. అనంతరం టీడీ గుట్ట మార్కెట్ నుంచి క్లాక్‌టవర్ వరకు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 2వ తేదీన టీడీ గుట్ట, డైట్ కళాశాల వెజ్, నాన్ వెజ్ మార్కెట్, స్లాటర్ హౌస్ పనులు పూర్తి చేసి.. ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
టీడీ గుట్ట ప్రాంతం పారిశుధ్య నిర్వహణలో విఫలమైన సిబ్బందికి మెమోలు జారీ చేసి, కొత్త సిబ్బందిని నియమించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్‌ను ఆదేశించారు. మార్కెట్ రోడ్డు సమీపంలో రూ.20లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి క్యూరింగ్ చేశారు. నిర్మాణంలో ఉన్న పాత రైతుబజార్‌ను కూల్చేసి, అధునాతన హంగులతో కొత్త రైతుబజార్ నిర్మిస్తామన్నారు. స్లాటర్ హౌస్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఈఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఆర్అండ్బీ ఈఈ స్వామి, డీఈ సంధ్య, అధికారులు పాల్గొన్నారు.
మహానగరంగా మహబూబ్‌నగర్..
మహబూబ్‌నగర్ టౌన్, మే 11 : మహబూబ్‌నగర్ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలకొండ వార్డు పరిధిలో ఉన్న సాగర్ కాలనీలో మంత్రి పర్యటిం చి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కా లనీల్లో దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నామ న్నారు. సాగర్కాలనీలో రోడ్డు, కల్వర్టుల నిర్మాణంతోపాటు ఇంటింటికీ తాగునీరందేలా చూస్తామన్నారు. కేసీఆర్ ఎకో పార్కు, నెక్లెస్‌రోడ్డు, నైట్ సఫారీ, ఐలాం డ్, ఐటీ టవర్ తలమానికంగా ఉన్నాయన్నారు. మం త్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్ నరేందర్, నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

