అమరచింత, ఏప్రిల్ 4 : పొట్టదశకు వచ్చిన వరి పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడంతో వడ్లు తాళ్లుగా మారిపోతాయని, దయచేసి ఇంకా రెండు వారాలపాటు పంటలకు సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నందిమళ్ల గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ఎమ్మెల్యేను రైతులు రా జేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, న ర్సింహులు, భాస్కర్‌రెడ్డి, రాజు కలిశారు. ఎడమ కాల్వ పరిధిలో నందిమళ్ల, మూలమాళ్ల, మస్తీపూర్ శివారులో రైతులు సాగు చేసిన వరి పంటలు ఇప్పుడు పొట్టదశలో ఉన్నాయన్నారు.
ఇప్పటికే వారబంధి ద్వారా నాలుగు రోజులకోసారి సాగునీరు వదలడంతో పంటలు తడి ఆరిపోతున్నాయని వా పోయారు. స్పందించిన ఎమ్మెల్యేప్రాజెక్టు ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. డ్యాంలో తాగునీటి అవసరాలకు మా త్రమే నిల్వలు ఉన్నాయని చెప్పడంతో కనీసం లీకే జీ నీరైనా కాస్తా ఎక్కువగా విడుదల చేస్తే మో టర్లు పెట్టుకుని రైతులు పంటలను కాపాడుకుంటారని సూచించారు. వినతిపత్రం ఇచ్చి న వారిలో శ్రీనివాసులు, బాల్ రాం, మైనొద్దీన్, రాజు, చంద్రశేఖర్, గోవింద్ ఉన్నారు.