మహబూబ్నగర్ నెట్వర్క్, ఆగస్టు 28 : తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం రై తులు యూరియా గోస పడుతున్నారు. రైతుకు రెండు బస్తాల చొప్పున అందిస్తుండడంతో చే సేది లేక కుటుంబ సభ్యులంతా తరలివస్తున్నారు. ప్యాక్స్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద నిరీక్షించి నీరసించిపోతున్నారు. గురువారం సైతం రైతులకు అరిగోస తప్పలేదు.
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సింగిల్విండో కార్యాలయం వద్దకు ఉదయం 5 గంటలకే రైతులు చేరుకొని క్యూ కట్టారు. 700 బస్తాల యూరియాను మార్క్ఫెడ్ సరఫరా చేయగా.. 350 మంది రైతులకు పంపిణీ చేశారు. మిగితా 1150 మందికి టోకెన్లు అందజేసి చేసి తర్వాత పంపిణీ విండో సిబ్బంది తెలిపారు. దివ్యాగులు సైతం యూరియా తరలివచ్చారు. గద్వాల పీఏసీసీఎస్ వద్ద ఉదయం 4 గంటలకే రైతులు తరలివచ్చి యూరియా కో సం పడిగాపులు కాశారు.
లైన్లలో వృద్ధులు, మహిళలు, రైతుల కుటుంబ సభ్యులు గంటల తరబడి క్యూలో వేచి ఉండగా.. కార్యాలయం సమయానికి సిబ్బంది వచ్చి రైతులకు యూరియా పంపిణీ చేశారు. అరకొరగా అం దించడంతో పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దమగ్నాపూర్ గ్రామ ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 400 బ స్తాల యూరియా కోసం అన్నదాతలు గంటల తరబడి పడిగాపులు కాశారు.
ధన్వాడ పీఏసీసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు నిరసనకు దిగారు. దీంతో 600 బస్తాల యూరియాను అధికారులు పంపిణీ చేశారు. మిగితా రైతులకు టోకెన్లు అందించి తర్వాత పంపిణీ చేస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని రై తు వేదిక వద్దకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. యూరియా తీసుకోవడం అత్యవసరం ఉండగా.. గంటల తరబడి క్యూలో బారులుతీరారు.
హన్వాడ మండల కేంద్రంలోని రైతు సే వా సహకార సంఘం ఆవరణ రైతులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే అన్నదాతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భారీగా క్యూలైన్ కనిపించింది. 300 బస్తాల యూరియా రా గా.. కేవలం 150 మంది రైతులకే అందించ గా.. మిగితా వారికి నిరాశ తప్పలేదు. అలాగే వనపర్తి జిల్లాలోని అమరచింత, ఖిల్లాఘణపురం, గద్వాల జిల్లాలోని గట్టు, మల్దకల్, ఇటిక్యాల, వడ్డేపల్లి, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర, మిడ్జిల్, నాగర్కర్నూల్, అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, లింగాల, తిమ్మాజిపేట, బిజినేపల్లి, కల్వకుర్తితోపాటు పలు చోట్ల యూరియా కోసం రైతులకు ఎదురుచూపులు తప్పలేదు. ఓ వైపు అధికారులు యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా.. సరిపడా అందించకపోవడంలో ఆంతర్యమేమిటని కర్షకులు నిలదీస్తున్నారు.