గద్వాల, ఆగస్టు 19 : ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఈ సమయంలో రైతులకు యూ రియా అవసరమని రైతులకు అవసరమైన యూరి యా లేక రైతులు తల్లడిల్లుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యతో పాటు జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, రిజర్వాయర్లను నీటితో నింపాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. గద్వాల జిల్లాకు ఈ సంవత్సరం పంటకు సరిపడే విధంగా కాకుండా గత సంవత్సరం నివేదిక ఆధారంగా, ప్ర భుత్వం ఈ ఏడాది వానకాలంకు 15వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందన్నారు. ఇప్ప టి వరకు వివిధ సంస్థల ద్వారా రైతులకు 14,500 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందన్నారు.
ఇంకా రైతులకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియా అత్యవసరమని, అయితే జిల్లాలో యూరియా లేక రైతులు తల్లడిల్లుడతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జిల్లాకు రావాల్సిన యూరియా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. రైతులు ప్రతి రోజు వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా కోసం పడి గాపులు కాస్తున్నారన్నారు. యూరియా సరైనా సమయంలో రాకపోతే రైతులు నష్టపోయే ప్రమా దం ఉందన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ఇనుప తాళ్లు తెగిన విషయం బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూప్ల మార్పు, రబ్బర్‌సీళ్లు, స్టాప్‌లాక్ గేట్‌ను జలాశయం గేట్ల వెనుక భాగన పెట్టి మరమ్మతులు చేయాలని కోరామన్నారు. అధికారులు వీటి మరమ్మతుల కోసం సుమారు రూ.4 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రస్తుతం జూరాలకు 2లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఉందని, వరద 5.6లక్షల క్యూసెక్కులు దాటితే అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని, అట్టి సమయంలో గేట్లు మొరాయిస్తే వరద జలాలు వెనక్కి వెళ్లి గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
వారం రోజుల కిందట జరిగిన రాష్ట్రస్థాయి ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్షా సమావేశంలో జూరాల గేట్ల మరమ్మతుల అంశం చర్చకు రాక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గేట్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలన్న ద్యాస ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సంగాల రిజర్వాయర్ ఎందుకు నింపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాటికుంట రిజర్వాయర్ సామ ర్థ్యం 1.5 టీఎంసీలు అయితే కేవలం 0.5 టీఎంసీ నీటిని మాత్రమే నింపారన్నారు. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పథకంలోని 99,100 ప్యాకేజీల పనులు వెంటనే పూర్తి చేసి రైతుల చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని, భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంను వరి పంట సాగులో మించింది, దేశం తెలంగాణ వైపు చూసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వం రైతులను బజారున పడేసిందని, కేసీఆర్ నాయకత్వంలో రైతు ఎలాంటి దిగులు లేకుండా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల లభ్యతతో రాజుగా బతికాడని, నేటి ప్రభుత్వం అన్ని విషయాల్లో రైతులకు భరోసా కల్పించడం, ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో 50వేల మంది దరఖాస్తు చేసుకుంటే మొదటి విడుతగా జిల్లాకు 7వేల ఇండ్లు కేటాయించగా ఇప్పటి వరకు 1000 మంది లబ్ధిదారులు కూడా ఇండ్లు నిర్మించుకోవడానికి ముం దుకు రావడం లేదని, ఇది లబ్ధిదారులకు ప్రభుత్వంపై నమ్మకం లేకనే అన్నారు. పై సమస్యలు ప్రభుత్వం స్పందించక పోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళ చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు బాసు హన్మంతునాయుడు తదితరులు పాల్గొన్నారు.