అకాల వర్షం.. అపారనష్టం
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో బుధవారం రాత్రి గం టపాటు అకాల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచా యి. ఊట్కూర్, మొగ్దుంపూర్, తిప్రాస్‌పల్లి, ఓబ్లాపూర్ శివారు గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంటలు నేలకు వరిగి గింజలన్నీ నేల రాలినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులు కల్లాల్లో నిల్వ చేసిన వరి, ఉల్లి గడ్డ బస్తాలు వర్షానికి తడిసి ముైద్దె రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- ఊట్కూర్, మక్తల్‌లో భారీ వర్షం
- నేలకొరిగిన వరి పంటలు
ఊట్కూర్, మే 7 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో బుధవారం రాత్రి గం టపాటు అకాల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీచా యి. ఊట్కూర్, మొగ్దుంపూర్, తిప్రాస్‌పల్లి, ఓబ్లాపూర్ శివారు గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంటలు నేలకు వరిగి గింజలన్నీ నేల రాలినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులు కల్లాల్లో నిల్వ చేసిన వరి, ఉల్లి గడ్డ బస్తాలు వర్షానికి తడిసి ముైద్దె రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు కొన్ని గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
కల్లాల్లో తడిసిన ధాన్యం
మక్తల్, మే 7 : యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడంలో జాప్యం కావడంతోనే ధాన్యం వర్షార్పణమతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామ స్టేజి వద్ద కల్లాలపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యంతో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సరైన సమయంలో సేకరించకపోవడం వల్లనే, ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని, ఆరుగాలం చెమటోడ్చి పడిన కష్టమంతా వర్షార్పణం అవుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాలంగా కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తూకాలు చేయడంలో ససేమిరా అనడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమపద్ధతిలో రైతుల నుంచి యాసంగి సీజన్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సేకరిస్తే ఈ సమస్యలు రావన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులపై నిర్లక్ష్య వైఖరిని వీడి ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- farmers
- paddy
- untimely rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

