మహబూబ్నగర్ రూరల్ : మండలంలో (Mahabubnagar) సోమవారం అకాల వర్షం కురిసింది. దాదాపు రెండువేల క్వింటాళ్ల వరి ధాన్యం (Paddy Grain) పూర్తిగా తడిసి ముద్దయ్యింది. వర్షానికి ధాన్యం తడువకుండా చేసిన ప్రయత్నాల లోపే ధాన్యం తడిసింది. మండలంలోని కోకదిర, ఓబులాయపల్లి, రామచంద్రపురం, అప్పయ్యపల్లి, కోడూరు గ్రామాల్లోనూ అకాల వర్షానికి పంట నేలపాలయ్యింది.
మన్యంకొండ స్టేజీ వద్ద వారం రోజుల క్రితం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ( MLA Srinivas Reddy ) ప్రారంభించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.