దంచికొట్టిన వాన.. రైతన్న హైరానా
ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- పలు చోట్ల ముంచెత్తిన అకాల వర్షం
- అయిజలో ఇండ్లల్లోకి చేరిన వాననీరు
- నేలకొరిగిన స్తంభాలు, తడిచిన ధాన్యం
అయిజ, మే 29 : ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయిజ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షం నీటితో నిండిపోయాయి. రాయిచూర్ రహదారిలోని ఓ కాలనీ వరద నీటితో ముంచెత్తింది. బుడగ జంగాల కాలనీకి చెందిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాయిచూర్ రహదారిపై ఉన్న కల్వర్టు ఆక్రమణకు గురై మూసుకుపోవడంతో వాన నీరు వాగులు, వంకలకు చేరకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పులికల్ గ్రామ పంచాయతీ ఆవరణలోని చెట్లు కూలగ ఉత్తనూర్ సమీపంలోని గంగమ్మ వాగు పొంగి పొర్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్టు కూలి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మండల వ్యాప్తంగా 38.8 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అలుగు పారుతున్న చెరువులు
ఉప్పునుంతల, మే 29 : ఉప్పునుంతల మండలంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఉప్పరిపల్లి, తాడూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కురిసిన భారీ వర్షానికి కంసానిపల్లి మహాసముద్రం చెరువు నిండి అలుగు పారుతున్నది. వడ్లగండ్లతో వర్షం పడడం వల్ల వరిచేళ్లకు కొంత నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ముఖ్యంగా తాడూర్- ఉప్పునుంతల ప్రధాన రహదారిలో 33 కేవీ లైన్ తెగిపడి స్తంభాలు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. మూడురోజులుగా రైతులు నాటిన పత్తి విత్తనాలు కొట్టుకపోయాయి.
ఈదురుగాలుల బీభత్సం
తెలకపల్లి, మే 29 : మండలంలో శుక్రవారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలులకు వివిధ గ్రామాల్లో పెద్ద వృక్షాలు రోడ్లపై అడ్డంగా విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని ఆలేరు గ్రామంలో బత్తుల బక్కయ్య కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టగా ఈదురు గాలులకు కొత్త ఇంటిపై రేలింగ్ కూలిపోయింది. అలాగే బత్తుల శేఖర్ పైకప్పు రేలింగ్ పగిలింది. అలాగే బత్తుల ఈశ్వరమ్మ రేకుల ఇల్లు పైకప్పు ఎగిరిపోయాయి. అలాగే బీరకాల మశన్న పూరి గుడిసెకు ఇరువైపులా గోడలు కూలడంతో ప్రమాదం తప్పింది.
గ్రామంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు పాఠ శాలలో పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపోయాయి. గౌరెడ్డిపల్లి, పెద్దూరు మధ్యన రోడ్లపై పడిన చెట్లను పోలీసులు తొలగించగా, ఈదురుగాలులతో విరిగిపోయిన స్తంభాలకు విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

