Accident | మరికల్, మార్చి 09: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మరికల్లో చోటుచేసుకుంది. మరికల్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి సమీపంలోని మహబూబ్నగర్ రహదారిపై గల భవాని దాబా ఎదురుగా శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాహనదారులు మరికల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్సై రాము తెలిపారు.
Marikal