మక్తల్, మే 20 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వి ద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు బడులు పునః ప్రారంభించే నాటికి అందుతాయా లేదా అనే సందేహాలు నారాయణపేట జిల్లాలో మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖను పటిష్ట పరుస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌ లిక వసతులను కల్పించడంతోపాటు, ప్రతి విద్యార్థికి ఉచిత యూ నిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలను సరైన సమయం లో అం దించింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పుకుంటూ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయించినమం టూ గొ ప్పలు చెప్పుకుంటుందే తప్పా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసిన దాఖలు లేవని తేలిపోయింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బడి పునఃప్రారంభించే నాటికి యూ నిఫాంలు అందించాలని అధికారులు విద్యార్థుల కొలతలు తీసుకొని జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు స్టిచ్చింగ్ చేసే బాధ్యతలను అప్పగించారు.
నారాయణపేట జిల్లాలో 470 పాఠశాలల్లో 55,275 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 25,469మంది బాలురు, 29, 806మంది బాలికలకు మొత్తం 55,270 యూనిఫాంలు సిద్ధం చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి 2,35, 700 మీటర్ల బట్ట ఇదివరకే జిల్లా కేంద్రానికి రావడంతో అధికారులు స్వయం సహాయక సంఘాలకు స్టి చ్చింగ్ చేసేందుకు ఆయా మండలాలకు సరఫరా చేశా రు.
జిల్లా లో 822 స్వయం సహాయక సంఘాల్లోని 85, 210 మంది సభ్యులు ఉండగా జిల్లాలోని అన్ని మండల కేంద్రా ల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు కావాల్సిన ఏకరూప దుస్తుల తయారీని అప్పజెప్పారు. గతేడాది స్వ యం సహాయక సంఘాలకు పాఠశాల ఏకరూప దుస్తులు తయారీ అప్పగించడం వల్ల మొదటి జత దుస్తులను పాఠశాల తెరిచిన రెండు నెలలకు అప్పజెప్పి, రెండో జత బట్టలను మాత్రం అరకొరగా విద్యాసంవత్సరం ముగిసేంతవరకు ఇవ్వకపోవడంతో చాలామంది విద్యార్థులకు పాఠశాల ఏకరూప దుస్తులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో తలెత్తాయి. ప్రస్తుతం ఈ నూతన విద్యా సంవత్సరం లో పాఠశాల ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు అందుతాయా లేదా వేచి చూడాల్సిందే.
స్టిచ్చింగ్ షురూ చేసిన స్వయం సహాయక సంఘాలు
2025-26 నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలు జిల్లాలోని ప్రతి మండలంలోని పాఠశాలల్లో దుస్తులను స్టిచ్చింగ్ చేసే పనిని ప్రారంభించారు. యునిఫాంలు సమయానికి అందిస్తారా లేదా అనే అం శాన్ని ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవో, ఎంఈవో, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూనిఫాం స్టిచ్చింగ్ ఎంత వరకు వచ్చిందనే వివరాలను రోజువారీగా సమీక్షించి సభ్యులకు పని వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. ఒక యూనిఫాం కుట్టేందుకు ప్రభుత్వం కూలి రూ.75 చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు నికర్, షర్టు, ఒకటి నుంచి మూడో తరగతి చదివే బాలికలకు సర్ట్, 4, 5 తరగతులు చదివే బాలికలకు షర్టు, లహంగా, ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థినులకు పంజాబీ డ్రెస్లను ఇవ్వనున్నారు. గతేడాది మాదిరిగానే విద్యార్థులకు ఏకరూప దు స్తుల పంపిణీ ఆలస్యం అవుతుందా, లేక పాఠశాల తెలిసే నాటికి దుస్తులు సిద్ధంగా ఉంటాయా వేచి చూడాల్సిందే. అయితే జిల్లాలోని విద్యార్థులకు ఇప్పటికే 42శాతం దు స్తుల స్టిచింగ్ పూర్తయినట్లు సేక్టోరియల్ అధికారి చెప్పారు.