నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూలై 5 : ‘గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి..’ అన్న డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరుద్యోగుల మార్చ్‌కు వెళ్లకుండా పలువురిని నిర్బంధించారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను అడుగడుగునా పోలీసులు అడ్డుకొన్నారు. బీఆర్ఎస్తోపాటు విపక్షాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతల ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. ముందస్తుగా వారిని ఖాకీలు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఉమ్మడి పా లమూరు జిల్లాలో శుక్రవారం నిరుద్యోగుల మార్చ్‌కు వెళ్లకుండా సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన టీజీపీఎస్సీ ముట్టడికి బయలుదేరుతారన్న సమాచారంతో అచ్చంపేటలోని బీఆర్ఎస్, గిరిజన విద్యార్థి, యువజన విభాగం నాయకులను పోలీ సు లు అదుపులోకి తీసుకున్నారు. అయిజ పట్ట ణం లోని నిరుద్యోగ జాక్ నాయకులను తెల్లవారు జాము నే పోలీసులు అరెస్టు చేశారు.
సాయంత్రం సొంత పూచీకత్తుపై ఎస్సై విజయ్ భాస్కర్ విడుదల చేశారు. అలాగే విద్యార్థి సంఘం నేత మన్యాన్ని గద్వాల టౌన్ పోలీసులు, ధరూర్‌లో ఏబీవీపీ మండల నేత సురేశ్‌ను, గట్టులో విద్యార్థి సంఘం నాయకులను, అమరచింతలో తోకలి రమేశ్‌తోపాటు బీఆర్ఎస్వీ నాయకులు ప్రేమ్‌కుమార్, డీసీ పురుషోత్తం, కొ త్తకోటలో బీఆర్ఎస్ నేత జనుంపల్లి కిరణ్‌తోపాటు మక్తల్‌లో బీజేవైఎం, పీడీఎస్‌యూ, ఎన్ఎస్యూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చార కొండలో బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ చండీశ్వర్, మండల కోఆప్షన్ మాజీ సభ్యుడు షేక్ సలీం, బీజేపీ నేత కన్నా హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వారి ఇండ్లల్లో పోలీసులు సోదాలు జరిపారు.
నిద్రి స్తున్న బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంకల దాస్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు తిరుపతినాయక్తోపాటు పలువురిని అదుపులోకి తీ సుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలు వురు మాట్లాడుతూ డీఎస్సీ పోస్టులను పెంచా లని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మూడు నెలలు గడువు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్ట్‌లతో ఇంకా నిరుద్యోగులలో విప్లవ కెరటం ఎగి సి పడుతుందే తప్పా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిం చారు.
అక్రమంగా తమను అరెస్టు చేయ డంపై.. ప్ర భుత్వం నిరుద్యోగులపై వివక్ష చూపడ మేనని.. తమ హక్కులను హరించడమేనని అన్నారు. ప్రజాస్వా మ్య దేశంలో అక్రమ అరెస్టులకు పాల్పడి నిరుద్యోగు లపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమను చూపుతున్న దని విమర్శించారు. ప్రశ్నించే నిరుద్యోగుల నోరు నొ క్కడంతో రేవంత్ సర్కారు సాధించేది ఏమీ లేద న్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమ లు చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
నిరుద్యోగుల నిరసన
ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీ వే యాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. గ్రూప్-1ప్రిలిమినరీలో 1:100 క్వాలిఫై ప్రకటించాలని, గ్రూప్-2కు అదనంగా మరో 2వేల పోస్టులు, గ్రూప్-3 నోటిఫికేషన్‌కు అదనంగా 3వేల పోస్టులు పెంచి భర్తీచేయాలనే డిమాండ్లతో కృష్ణవేణి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వీరికి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య మద్దతుగా మాట్లాడారు.
25వేలతో మెగా డీఎస్సీని ప్రకటించాలని, తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి డిమాండ్లను తీర్చాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ఇప్పటికే 17 సార్లు చక్కర్లు కొట్టాడని విమర్శించారు. నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వాన్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేడు వారినే అణగ దొక్కే ప్ర యత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పంది ంచి నిరుద్యోగులకు మేలు చేయాలని డిమాం డ్ చేశారు. ర్యాలీలో మాధవ్, చిన్న, హరీశ్, నరసింహులు, జోయల్, రాము, వేణు, గోపాల్, బజారన్న, జయరాం, కిరణ్, మహేశ్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.