శ్రీశైలం, మార్చి 30 : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. భ్ర మరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లను బుధవా రం ఉదయం ఈవో లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి దర్శించుకున్నారు. అర్చకులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉం డాలని ఋత్వికలు శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ, అఖండ దీప కలశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యాహవాచనం, చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కలశస్థాపన, కంకణపూజ, కంకణధారణ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగం గా ఆలయ ప్రాంగణంలో మట్టిని తీసుకొని 9 పాలికల్లో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘ నంగా చేశారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలందుకున్నారు. చతుర్భుజా లు కలిగిన దేవి పై రెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తాధులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లును ఆ లయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండ పం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి బ యలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవాన్ని ని ర్వహించారు. గురువారం కైలాసవాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మహాదుర్గ అలంకరణ ఉం టుందని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఈఈ మురళీబాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్‌కుమార్, ఏఈవోలు హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, డీఈ లు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, ఆలయ పర్యవేక్షకుడు శ్రీహరి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.