జడ్చర్ల, సెప్టెంబర్ 25 : ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు వాసులు నిరసన తెలిపారు. బుధవారం రిజర్వాయర్ పనుల పరిశీలనకు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లితోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వచ్చారు. వీరికి తమ గోడు వెల్లబోసుకునేందుకు వెళ్తున్న నిర్వాసితులను అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యా యం చేస్తారని అనుకుంటే మధ్యలోనే ఎంపీ, ఎమ్మెల్యే, పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వెనుకబడిన జి ల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను మంత్రి జూపల్లి, నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు వల్లూరు-కిష్టారం బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పీఆర్ఎల్ఐ పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామ ని చెప్పారు. భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి రూ.45 కోట్లు విడుదల చేశామన్నారు. ముంపు వాసులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇ చ్చారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని నాలుగు తండాల కు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు విడుదల చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, కలెక్టర్ విజయేందిరబోయి, అధికారులు పాల్గొన్నారు.