మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబర్ 28 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులం బాలుర-3 నుంచి ఇద్దరు వి ద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాషాబ్‌గుట్ట పెద్ద శివాలయం సమీపంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల భవన సముదాయంలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకులంలో 8వ తరగతి చదువుతు న్న ముస్తఫా, అహ్మద్ ఈనెల 26వ తేదీన రాత్రి గురుకులం కిటికీ నుంచి దూకి పారిపోయారు.
తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు కన్పించడం లేదనే సమాచారంతో సీసీ కెమెరాలు పరిశీలించగా, కిటీకీ దూకి పారిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఇవ్వకపోవడం విశేషం. కాగా, మై నార్టీ గురుకులం నుంచి పారిపోయిన విద్యార్థులను గుంటూరు రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్ సిబ్బంది, పోలీసులు గుర్తించా రు. ముస్తఫా అమ్మను చూసేందుకు గు రుకులం నుంచి బయటకు వచ్చినట్లు విద్యార్థులు తెలిపినట్లు సమాచారం. విద్యార్థులు క్షేమంగా ఉన్నారనే సమాచారంతో గురుకుల సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.