జడ్చర్ల, ఫిబ్రవరి 3: జడ్చర్లలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జడ్చర్లలోని జాతీయ రహదారి చివరలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను డీసీఎం ఢీకొన్న ఘటనలో రాములు(45)అనే వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన రాములు జడ్చర్ల ఫ్లైఓవర్ చివరలో కావేరమ్మపేట దగ్గర రాంగ్రూట్లో బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.
కేసు నమోదు చేసి దర్యా ఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జడ్చర్ల ఫ్లైఓవర్ కింద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాస్(28) అనే వ్యక్తి మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన శ్రీ నివాస్ ఆదివారం రాత్రి జడ్చర్ల ఫ్లైఓవర్ కింద నడుచుకుం టూ వెళ్తుండగా.. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కేసునమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.