మక్తల్, ఏప్రిల్ 27 : పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
దాదనపల్లిలో కురువ కురుమూర్తి(16) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. మక్తల్ మున్సిపాలిటీలో 8వ వార్డు కొత్త గార్లపల్లిలో కర్రె లక్ష్మప్ప అనే రైతుకు చెందిన కాడెద్దు వ్యవసాయ పొలంలో మేత మేస్తుండగా పిడుగుపడటంతో మృతిచెందింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధా న్యం తడిసిపోయింది. కృష్ణ మండలం కాందోటికి చెందిన రైతు తాయప్ప పొలంలో పిడుగుపడడంతో ఆవు మృతిచెందింది. మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల్లో ధాన్యం తడిసిపోయింది.