గద్వాల అర్బన్, ఏప్రిల్ 29 : నర్సింగ్ పూర్తి చేసి వైద్య సేవలు అందించాలన్న తన కల తీరకుండానే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు హాస్టల్ వెళ్లేందుకు సిద్ధమై ఓ ట్రాక్టర్ షోరూం వద్ద నిలుచున్నా రు. ఈ క్రమంలో ఎర్రవల్లి నుంచి గద్వాలకు వస్తున్న ఓ బొలెరో వేగంగా దూసుకువచ్చి షోరూం దగ్గర నిల్చున్న విద్యార్థులతోపాటు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న మక్తల్‌కు చెందిన మహేశ్వరి(20), వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అక్కడికక్కడే మృతి చెందారు.
అ లాగే భువనగిరికి చెందిన ప్రణతి, సంగారెడ్డికి చెందిన చరణ్ భూపాల్, గద్వాలకు చెందిన నితిన్ గోపాల్, మంగళ్, వెంకటేశ్‌కు గా యాలు కావడంతో స్థానికులు వారిని వెంటనే జిల్లా దవాఖానకు తరలించారు. వి షయం తెలుసుకున్న కలెక్టర్ సంతోష్, ఎస్పీ తోట శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని విద్యార్థినుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం గాయపడ్డ వారిని పరామర్శించా రు. విద్యార్థినుల మృతికి కారణమైన వారిని తక్షణమే పట్టుకొని శిక్షించాలని కళాశాల విద్యార్థులు దవాఖాన వద్ద ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళన విరమించాలని లాఠీచార్జి చే శారు. అనంతరం వారిని శాంతింపజేశారు. విద్యార్థినుల మృతికి కారకులైన వారిపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాగనూరు, ఏప్రిల్ 29 : మాగనూరు మం డలం గురురావు లింగంపల్లి గ్రామానికి చెం దిన నర్సింగ్ విద్యార్థిని మహేశ్వరి ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురురావు లింగంపల్లికి చెందిన మారెప్ప, మణెమ్మ దంపతులు యాచక వృత్తితో జీవనం సాగిస్తున్నారు. తమ పెద్దల తరం నుంచి యాచకవృత్తిని నమ్ముకున్న కుటుంబం తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తండ్రి మారెప్ప గత కొంతకాలంగా పక్షవాతంతో మంచాన పడడంతో ఐదుగురు కూతుళ్లను, కొడుకును తల్లే పెంచిపోషిస్తున్నది. ఐదుగురిలో చివరి అమ్మాయి మహేశ్వరి గద్వాల జిల్లాలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ అకడే హాస్టల్లో ఉంటున్నది. బస్సు కోసం ఎదురుచూస్తుండగా బొలేరే ఢీకొట్టడంతో ఆ పేద దంపతుల ఆశలు కలగానే మిగిలాయి.