అచ్చంపేట, జనవరి 24 : మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, అచ్చంపేటకు చెందిన ముగ్గురు ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. శనివారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్స్ పెరగడంతో మావోయిస్టులు అక్కడి నుంచి చిన్నచిన్న గ్రూపులుగా తిరగడం మొదలుపెట్టారని తెలిపారు. వీరు అచ్చంపేట ప్రాంతంలో తిరిగి మావోయిస్టు కార్యకలాపాలను పుట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
పల్నాడు గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పామిడిపాడు గ్రామానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మీసాల సలోమాన్ అలియాస్ సంతోష్ అలియాస్ నాగరాజు వయస్సు (52), 1994లో నల్లమల బొల్లపల్లి దళంలో చేరినట్లు వివరించారు. మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా, డీకే ఎస్‌జెడ్‌సీఎం సభ్యుడు, మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీ మ్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని.. 64 కేసుల్లో కీలక నిందితుడని, అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉందన్నారు. పోలీస్ స్టేషన్లపై, క్యాంపులపై పలు దాడుల్లో ప్రధా న పాత్ర పోషించినట్లు వెల్లడించా రు.
ఆయన భార్య కోయతెగకు చెందిన నన్బాటి (46) ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా బూర్గులం క గ్రామానికి చెందిన ఆమె కేం ద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 20ఏండ్లు గా మావోయిస్టు కార్యకలాపా ల్లో పాల్గొంటుందని, పీఎల్జీఏ బెటాలియన్ 2వ కంపెనీ కమాండర్‌గా పనిచేస్తున్నారని.. ఈమె పై రూ.8లక్షల రివార్డు ఉందన్నా రు. మావోయిస్టు పార్టీ కేంద్ర క మిటీకి చెందిన దేవుజీ, బాడే చొక్కారావు ఆదేశాల మేరకు ఇద్దరు మావోయిస్టులు నల్లమలకు రాగా.. వీరికి అమ్రాబాద్ మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీపీఎఫ్ కో కన్వీనర్ అంబయ్య, మన్ననూర్‌కు చెందిన పౌరహక్కుల సంఘం నాయకులు జక్కా బాలయ్య, లింగాల మండలం క్యాం పు రాయవరం గ్రామానికి చెందిన యాదయ్య సహకారంతో నల్లమలలో కార్యకలాపాలు పునరుద్ధరించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.
వీరు శనివారం ఉదయం 11:30గంటల ప్రాంతంలో మన్ననూర్ నుంచి అచ్చంపేటకు ప్రయాణిస్తున్న ఎర్టిగా కారు (టీఎస్ 07 ఎఫ్యూ 3992)ను అచ్చంపేట సీఐ నాగరాజు అ డ్డుకొని వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కారు, రూ. లక్షా 25వేల నగదు, ఏకే 47, ఐఎన్ఎస్ఎఎస్ తుపాకుల 20 లై వ్ రౌండ్లు, వాకీటాకి, 5 జిలెటిన్‌స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎ స్పీ తెలిపారు. మావోయిస్టులకు ఆశ్రమం, భోజనం, డ బ్బు, ర వాణా కల్పించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వ ర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, అచ్చంపేట, అ మ్రాబాద్ సీఐలు నాగరాజు, శంకర్, ఎస్సై సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు.

రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజా సంఘాల నేతలను శుక్రవారం రాత్రి పోలీసులు వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టీపీఎఫ్ అంబయ్యను రాత్రి వంకేశ్వరం గ్రామంలో ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకోగా.. జక్కా బాలయ్యను మన్ననూర్ ఇంట్లోని తీ సుకురాగా.. రాయవరంలో ఇంట్లో ఉండగా యాదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే ఎవరు వచ్చారు.. ఎం దుకు వచ్చారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అన్న విషయాలు కూ డా తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ముగ్గురు ఎక్కడున్నారన్న విషయం బయట కు తెలియరాలేదు. హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చి తీసుకెళ్లారని చెప్పారని, దీంతో హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడ లేరని.. అ చ్చంపేటలోనే ఉన్నారని తెలుసుకొని తిరిగి సాయంత్రం వచ్చా రు. రాత్రి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.