చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి.. ఇద్దరు బాలురు మృతి
జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామ శివారులోని ఎర్రచెరువులో ఈత కొ ట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయం త్రం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జడ్చర్లటౌన్, జూన్ 5 : జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామ శివారులోని ఎర్రచెరువులో ఈత కొ ట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయం త్రం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల లోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన సోహెల్ (14), అబ్దుల్ రెహమాన్(15) బాలురు మరో ఇద్దరు మిత్రులతో కలిసి పట్టణ శివారులోని కిష్టంపల్లి గ్రామ ఎర్రచెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో సోహెల్, అబ్దుల్ రెహమాన్‌కు ఈత రాకపోవటంతో ఇద్దరు ప్రమాదవశాత్తు జారి నీట మునిగారు. ఈ విషయాన్ని తోటి మిత్రులు వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకొని చెరువులో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం బాలుర మృతదేహాలను జడ్చర్ల మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

