బోథ్, ఆగస్టు 7 : ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలువడంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మెట్పల్లి గంగాధర్ డీప్ వెయిన్థ్రాంబోసిస్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్నాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా మిత్రులు నరేశ్‌గౌడ్, మంజీర శ్రీనివాస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్‌నకు వివరించగా ఆయన కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్ స్పందించి చికిత్సకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించి బాధితుడి ప్రాణాలు కాపాడి కుటుంబానికి అండగా నిలిచారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న బాధితుడు తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారి ఆరోగ్యం గురించి ఆరా తీసి, ధైర్యం చెప్పారు.