పాలమూరు, డిసెంబర్ 19: తెలంగాణ, ఏపీ ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు అందరికీ ఒకే మాదిరిగా తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలని.. అం దుకు అనుభవజ్ఞులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూ చించారు. గురువారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఏపీలో ఉన్న ఏకైక సం బం ధం తిరుపతి, తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ తిరుపతి లో తలనీలాలు సమర్పించుకుంటారన్నారు.
ఉమ్మడి రాష్ట్రం లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేవని, రెం డు రాష్ర్టాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతోపాటు టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగింపుగా దర్శనాలు జరిగేవని, గతం లో ఏపీ సీఎంలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు కొనసాగింపు దర్శనాలు జరిగాయన్నారు.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు, రాజకీయ నాయకులు, వ్యాపాయవేత్తలు డిఫరెన్స్ కనిపిస్తున్నదని.. ఇది మంచి పరిణామం కాదన్నారు. టీటీడీ పాలక మండలి అంటే మాకు చాలా గౌరవం ఉందని.. తిరుమల దేవుడు ప్రపంచానికే దేవుడన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన.. మాది అని దేవుని విషయంలో అనుకోవద్దని.. అలా అనుకుంటే ఆ దేవుడికే కోపం వస్తుందన్నారు. పదేండ్లలో హైదరాబాద్, తెలంగాణలో ఆంధ్రప్రజలను, వ్యాపారవేత్తలను భేదాభిప్రాయా లు లేకుండా చూశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ వ్యాపారులే లాభపడ్డారన్నారు. తెలంగాణలో టీటీడీ కల్యాణ మండపాలకు స్థలాలు ఇవ్వడం గొప్ప సంకల్పంగా, అదృష్టంగా భావిస్తామన్నారు.
అదేవిధంగా భక్తులకు రూమ్స్, దర్శనంలో చాలా ఇబ్బందు లు పడుతున్నారని, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు ఇచ్చి న మాదిరిగానే తిరుమల కొండపై కాటేజ్ నిర్మాణానికి తెలంగాణకు ఒక ఎకరం స్థలం ఇవ్వాలని గతంలో కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో టీటీడీపై అపారమైన గౌ రవంతో తెలిపినట్లు పేర్కొన్నారు. ఆయనతోపాటు గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు జిల్లా మాజీ డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్ తదితరులు ఉన్నారు.