ప్రతిభకే పట్టం
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు పలు శాఖల్లో ఉద్యోగులుగా, అధికారులుగా సేవలందిస్తున్నారు.
- పారదర్శకంగా.. పార్టీకలతీతంగా కొలువులు
- టీఎస్పీఎస్సీ ఉద్యోగాల్లో ప్రతిపక్షాల బిడ్డలు
- పైరవీలు లేకుండా స్థానికులకు పెద్దపీట
- పలుమార్లు భారీగా నోటిఫికేషన్
- హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు
నాగర్‌కర్నూల్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : టీఎస్పీఎస్సీ ఉద్యోగాల కల్పనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. పైరవీలకు తావు లేకుండా, పార్టీల ప్రమేయం లేకుండా కొలువులను అందిస్తున్నది. ఇటీవలే పూర్తయిన గ్రూప్-1తో పాటు 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడంతో ఉద్యోగార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిభే కొలమానంగా..
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు పలు శాఖల్లో ఉద్యోగులుగా, అధికారులుగా సేవలందిస్తున్నారు. టీఎస్పీఎస్సీ గతానికి భిన్నంగా ప్రతిభకు పెద్దపీట వేసింది. ఇంతకముందు గ్రూప్ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని తొలగించింది. దీంతో పైరవీలకు, డబ్బులతో ఉద్యోగం కొనుక్కునే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. దీని వల్ల గ్రామీణ యువత సైతం మెరిట్ మార్కులతో పలు ఉద్యోగాలను సాధించారు. వివాదాలు లేకుండా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల భర్తీ జరిగింది. రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తల కుటుంబాల్లోని బిడ్డలకు సైతం ఉద్యోగాలు దక్కాయి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల కల్పనను చేపడుతుందనడానికి ఇదే నిదర్శనం.
ఈ క్రమంలో ఇటీవల బీజేపీ కార్యకర్త టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామక ప్రశ్నాపత్రాల లీకేజీలో దొరకడం రాష్ట్రంలో సంలచనంగా మారింది. నియామకాల ప్రక్రియను వందశాతం సాధించే క్రమంలో ఇటీవలే గ్రూప్-1,2,3,4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగాల భర్తీతో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతుందని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ కొలువులు వస్తాయనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని పలువురు పేర్కొంటున్నారు. దీనిని విస్మరించిన ప్రతిపక్షాలు (బీజేపీ, కాంగ్రెస్) కొలువుల భర్తీని అడ్డుకునేందుకు ఆందోళనలు చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆలోచనతో ముందుకు సాగుతున్న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను అడ్డుకోవడంపై అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష నాయకులు, నిరుద్యోగ యువత ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభ ఆధారంగానే నియామకాలు
ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వేస్తే కష్టపడి చదివి పరీక్ష రాశాను. ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం నియామకం చేపట్టింది. 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీలో 311 ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2016 ఏప్రిల్‌లో మరో వెయ్యి ఏఈవో పోస్టులకు రాత పరీక్షకోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 2017 అక్టోబర్‌లో కూడా 851 పోస్టులు వేసింది. 2016 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వేసి పరీక్షలో ప్రతిభ ఆధారంగా 2017జనవరిలో నన్ను ఏఈవోగా నియమించింది. ప్రభుత్వం ఉద్యోగం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది.
– ఎల్.సుధారాణి, ఏఈవో, కొల్లాపూర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- TSPSC
- TSPSC jobs
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

