మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు ఇబ్బంది సృష్టిస్తున్న కేం ద్రం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం అన్ని మండలకేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులకు మద్దతుగా ధర్నాలు చేపట్టి ఆందోళనలు నిర్వహించారు. కాగా, బుధవారం రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధం చే సేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. 44వ నెంబర్ జాతీయ రహదారిని ముట్టడించేందుకు ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా భూత్పూర్ మండలకేంద్రంలో రాస్తారోకో చేయనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటలపాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేసేందుకు సిద్ధమమయ్యారు.
జాతీయ రహదారి ముట్టడికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, విప్ గువ్వ ల బాలరాజు, ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. 14 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తు న తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గులాబీ దం డులా తరలివచ్చి కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యారు. రైతులకష్టాలు దేశమంతా తెలిసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంతో సం బంధం లేకుండా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టిన వీడియోలను ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి బీజేపీ చేస్తున్న దాష్టీకాలను అందరికీ తెలియేశారు. ఒకవైపు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తే.. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టి రైతులను వరి వేసేలా చేసి ఇప్పుడు చేతులు ఎత్తేసిన తీరుపై టీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. జాతీయ రహదారిని సుమారు 2 గంట లపాటు దిగ్బంధం చేయడంతో వాహనాల రాకపోకలు ని లిచిపోనున్నాయి. ఐదు నిమిషాలు ట్రాఫిక్ జాం అయితేనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. అలాంటిది రెండు గంటలపాటు అంటే భూత్పూర్ నుంచి హైదరాబాద్, ఇటు కర్నూలు వరకు ఎటుచూసినా వాహనాలు నిలిచిపో యే అవకాశం ఉన్నది. అయితే, వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు పోరాటం తప్పా వేరే మార్గం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులు పెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతల తీరును దేశమంతా గమనిస్తున్నది. వడ్లు కొనమని అడిగితే మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని కేంద్ర మంత్రి అవహేళన చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో రైతుల కోసం కేంద్రంపై పోరాటం చేయడం తప్పా వేరే గత్యంతరం లేదు. కేంద్రంపై జరుగుతున్న పోరులో భాగంగా పార్టీ అధిష్టానం పిలుపుమేరకు బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భూత్పూర్ వద్ద జాతీయ రహదారి ముట్టడి చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరుకానున్నారు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
మక్తల్‌రూరల్, ఏప్రిల్ 5 : సీఎం కేసీఆర్ పిలుపుమేరకు చేపట్టిన రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూత్పూర్ జాతీయ రహదారిపై నిర్వహించనున్న రహదారి దిగ్బంధానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. కృష్ణ మండలం టైరోడ్డు వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించగా.. పార్టీ ఆదేశాల మేరకు భూత్పూర్ జాతీయ రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం మెడలు వంచి వడ్లు కొనేదాకా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జడ్చర్ల, ఏప్రిల్ 5 : ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ని ర్వహించే రహదారుల దిగ్బంధా నికి భారీగా తరలిరావాలని టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భూత్పూర్ మం డల కేంద్రం సమీపంలోని మునిరంగస్వామి ఆలయం వద్ద 44వ జాతీయ రహదారిపై రాస్తారోకోను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.