కోడేరు: పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు (Sunstroke) గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. తండావాసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన గిరిజన కూలీ గర్మియా నాయక్ (45) అనే వ్యక్తి తన భార్య పిల్లలతో హైదరాబాద్( Hyderabad ) వలస వెళ్లి అడ్డా కూలిగా జీవనం కొనసాగిస్తున్నాడు.
మూడు రోజుల కిందట ఎండలో కూలీ పని చేస్తున్నండగా వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చేరాడు. దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య కవితతో పాటు కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు కోరారు.