నాగర్కర్నూల్, ఏప్రిల్ 9 : కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను చిన్నచూపు చూస్తుందని, ఇది ఎంత వరకు సమంజసమని ట్రాన్స్జెండర్లు మండిపడుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ తాము ఆడనా… మగ నా… అనే విషయం తేలా లంటే టెస్టులు చేయించుకోవాలని నిబంధనలు పెట్టడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం మా హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తుందని, మా హక్కులు మాకు దక్కాలని డిమాండ్ చేశారు.
పీఎం డౌన్ డౌన్, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఓ తండ్రిలాంటి వయసులో ఉన్న మోదీ మమ్మల్ని ఆడ అని నిరూపించుకోవాలంటే టెస్టులు చేయించుకోవాలని నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. మేము ఆడనే అని నిరూపించుకోవాలంటే నగ్నంగా నిలబడి టెస్టులు చేయించుకోవాలనడం కరెక్టు కాదన్నారు.
ఏ రాష్ట్రంలోనూ మా ట్రాన్స్జెండర్లలో నోట్లలో మెదిలిన ఏ ఒక్కరు ముందర పడలేదని, కుప్పకూలిపోయిన వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం తమకు అనుకూలం కాదని, వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని, వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవనం కావాలని కోరారు.