నవాబ్‌పేట, సెప్టెంబర్ 12 : నవాబ్‌పేట మం డల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి యూరియా కోసం అవస్థ లు పడుతున్నా.. అందడం లేదని.. అధికారు లు, పాలకులు సైతం స్పందించడం లే దం టూ నవాబ్‌పేట మండలంలోని వివిధ గ్రా మాల రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి మండలంలో యూరియా కోసం రైతులు గగ్గోలు పడుతున్నారు.
శుక్రవారం యూరియా వ స్తుందనే ఉద్దేశంతో వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నవాబ్‌పేట మండల కేంద్రానికి వచ్చారు. ఎంత నిరీక్షించినా.. యూరియా రా వడం లేదని తెలియడంతో ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగారు. రైతులు, మహిళా రైతు లు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వి షయం తెలుసుకున్న ఎస్సై విక్రమ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను వారించే ప్రయ త్నం చేశారు. అయినా వారు వినకుండా ఎస్సై విక్రమ్‌తో వాగ్వాదానికి దిగారు. యూరియా వచ్చేంత వరతకు ఆందోళన విరమించేది.. లేదని తెగేసి చెప్పారు. దీంతో ఎస్సై స్పందించి సోమవారం వరకు యూరియా వచ్చేలా కృ షి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించా రు. కాగా రైతులు రో డ్డుపై పడి యూరియా కోసం ఆందోళన చేస్తుం టే..వ్యవసాయ, రెవె న్యూ, పంచాయతీరాజ్ అ ధికారులు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వక్తం చేశారు.
హన్వాడ, సెప్టెంబర్ 12 : యూరియా కోసం మహిళా రైతులు శుక్రవారం మండల కేంద్రంలో మహబూబ్‌నగర్-చించోళి ప్రధా న రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజల నుంచి యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు స్పందించ పోవడం సిగ్గుచేటని అన్నారు. యూరియా వచ్చే వరకు ఆం దోళన విరమించబోమని చెప్పడంతో ఎస్సై వెంకటేశ్ అక్కడికి చేరుకొని రేపు యూరియా వస్తుందని పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళా రైతులు ఆందోళన విరమించారు.
మూసాపేట, సెప్టెంబర్ 1 : బ్యాంకులో ఏ ముందబ్బా..? ప్రతి రోజులు మనుషులు వెళ్లి వస్తున్నారు. నేను కూడా వెళ్లి చూస్తా అనుకున్నదేమో సుమారు 6 అడుగులు ఉ న్న ఓ కొండ చిలువ గురువారం రాత్రి మూసాపేట తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లోపలికి వెళ్లింది. కానీ అక్కడ దానికి అవసరం వచ్చేది ఏం లేదు అనుకొని అక్కడే ఉండిపోయింది. ఏదైనా ఎత్తుకొని వెళ్దాం అనుకున్నా వీలు పడలేదేమో ఆ పాముకు. అది చూసిన స్థానికులు ఉదయం బ్యాంక్ సిబ్బంది రాగానే సమాచారం ఇచ్చారు. దీంతో సీసీ టీవీ ద్వారా పరిశీలించి పాము లోపలనే ఉందని, వేముల గ్రామానికి చెం దిన గణేశ్ అనే యువకునికి సమాచారం ఇచ్చి పిలిపించారు. అతను పామును పట్టుకొని స్థానికంగా ఉండే గుట్టలో వదిలేశాడు.