మూసాపేట/చిన్నచింతకుంట, నవంబర్ 7 : నాటి రజాకార్ల నుంచి నేటి వరకు చేసిన సేవలు, పోరాటలతో చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ గ్రామానికి చెందిన తోకల ఎల్లారెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1926 అక్టోబర్ 10న జన్మించిన ఆయ న నిజాం కాలంలో రజాకార్ల పాశవిక దాడులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేశారు. ముఖ్యంగా సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయనతో ఉన్నదాంట్లో ఎంతో కొంత సహాయం అందించడంతో ఆయనను ప్రజలు దైవంలా భావిస్తారు. ఆయన ముక్కు సూటిగా వ్యవహరించడమే కాకుండా చెప్పిన మాటను తప్పకుండా పాటించేవాడని, హామీ ఇస్తే ఎన్ని ఇబ్బందులు పడినా నేరవేర్చే వాడని గ్రామస్తులు చెప్పుకుం టున్నా రు.
అందుకే ఆయన గ్రామంలో మూడు దఫాలుగా సర్పంచ్‌గా కొనసాగారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రాంతం, ప్రజల వెనకబాటు తనం గురించి వివరిస్తూ చేసిన ప్రసంగాలకు ఆకర్షితుడై పార్టీకి మద్దతుగా నిలిచి ప్రజలను చైతన్యం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఆయన కుమారుడు తోకల సురేందర్‌రెడ్డిని కూడా ప్రజా సేవ చేయాలని, ప్రజలకు మంచి చేస్తేనే జన్మకు సార్థకం అవుతుందని చైతన్యం చేసినట్లు తెలిపారు. ఆయన మాటకు విలువనిస్తూ ఆయన కుమారుడు తోక ల సురేందర్‌రెడ్డి కూడా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజా సేవలో మమేకం అవుతున్నారు.
నియోజకవర్గ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు, విద్యకు కూడా వారి తండ్రి సూచన మేర కు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అంతేకాకుండా ఆయన 2వ కుమారుడు తోకల రవీందర్‌రెడ్డి కూడా ప్రజలకు మంచి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇద్దరూ నడుకుంటూ ఉండడంతో ఆ గ్రామంలో ఇప్పటికి ఆ కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యస్తున్నారు. అయితే తోకల ఎల్లారెడ్డి గత 28వ తేదీన మృతి చెందారు. నేడు దశదిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పలువురు హాజరు అవుతున్నారు.