మక్తల్ ,అక్టోబర్ 16 : మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధి కొత్త గార్లపల్లిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమానిని గాయపరినిచిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త గార్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు దొంగలు చొరబడి, గ్రామంలోని మాల అంజిలప్ప ఇంట్లోకి చొరబడ్డారు.
గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దొంగలు, అంజిలప్ప భార్య మెడలోని పుస్తెలతాడును తెంచుకునే ప్రయత్నం చేయగా అంజిలప్ప దొంగలను అడ్డుకోవడంతో అడ్డుగా వచ్చిన ఇంటి యజమానిని దొంగలు తమ వెంబడి తెచ్చుకున్నసుత్తితో యజమాని తలపై బాధడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలను లెక్క చేయకుండా అంజిలప్ప ముగ్గురిలో ఒక దొంగను గట్టిగా పట్టుకోగా ఇద్దరు దొంగలుతప్పించుకొని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.